»   » బిచ్చమెత్తొద్దు: రజనీకాంత్ బాధ్యత లేదన్న నిర్మాతల సంఘం

బిచ్చమెత్తొద్దు: రజనీకాంత్ బాధ్యత లేదన్న నిర్మాతల సంఘం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘లింగా' చిత్ర నష్టాలకు రజనీకాంత్‌ను బాధ్యుడిని చేయడాన్ని తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ‘లింగా' నష్టాలకు పరిహారం ఇప్పించే బాధ్యతతను రజనీకాంత్ తీసుకోక పోవడాన్ని నిరసిస్తూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు రోడ్లపై బిచ్చమొత్తుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నిర్మాతల మండలి వారి చర్యను తీవ్రంగా ఖండించారు.

రజనీ సార్ సినిమాలు ఎప్పుడూ చాలా హై సక్సెస్ రేటు కలిగి ఉంటాయి. సినిమా అనేది వ్యాపారం కొన్ని సార్లు లాభాలు, కొన్ని సార్లు నష్టాలు సహజమే. నష్టాలకు రజనీకాంత్ ను బాధ్యుడిని చేయడం తగదు. నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ డిస్ట్రిబ్యూటర్లు బిచ్చమొత్తే కార్యక్రమం చేపట్టడం తగదు' అంటూ తమిళ నిర్మాతల మండలి స్పష్టం చేసింది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rajinikanth not responsible for 'Lingaa' losses: Producers Council

‘లింగా' చిత్రం ఆ మధ్య విడుదలైన కొన్ని చోట్ల నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. నష్ట పోయిన డిస్ట్రిబ్యూటర్లు రూ. 35 కోట్ల పరిహారం ఇప్పించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నష్టాల్లో 10 శాతం బర్తీ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ బిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు. పూర్తి స్థాయిలో నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ పై ఒత్తిడి తీవ్రతరం చేసేందుకు ఆయన ఇంటి ముందు బిచ్చమొత్తుకునే కార్యక్రమానికి సిద్ధమయ్యారు.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ‘లింగా' చిత్రం డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. అనుష్క, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అంచనాలు భారీగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా రేటు పెట్టి కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఈ చిత్రం నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

English summary
The Tamil Nadu Film Producers Council (TFPC) has strongly condemned the decision of the distributors of "Lingaa" to go on a mass begging protest and hold superstar Rajinikanth accountable for the film's losses.
Please Wait while comments are loading...