twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రసీమలోకి అలా అడుగుపెట్టా.. ఆ సమయంలో ఏడుపొచ్చింది: రజినీకాంత్ చెప్పిన వాస్తవాలు

    |

    సీనియర్ హీరో, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా 'దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ జోడీగా నయనతార నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా 'ద‌ర్బార్' ఆడియో వేడుక‌ నిర్వహించగా రజినీ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. వివరాల్లోకి పోతే..

     రజినీకాంత్ జీవితంలో..

    రజినీకాంత్ జీవితంలో..

    ద‌ర్బార్ వేడుకలో భాగంగా తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుంటూ ప్ర‌జ‌లు నాపై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అది ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వమ్ము కాదని చెప్పారు రజినీకాంత్. నాతో సినిమాలు చేసిన నిర్మాత‌లంద‌రూ న‌మ్మ‌కంతోనే సినిమాలు చేశారు. వారి న‌మ్మ‌కాలు నిజ‌మైయ్యాయి. ఇప్పుడు ప్ర‌జ‌లు నాపై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అది కూడా నిజమవుతుందని చెప్పారు రజినీకాంత్.

     ఎగ్జామ్ ఫీజ్ కట్టమని 120 రూపాయలిస్తే

    ఎగ్జామ్ ఫీజ్ కట్టమని 120 రూపాయలిస్తే

    ఈ సందర్బంగా తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన చెప్పారు రజినీ. తాను చిన్నప్పుడు స్కూల్ కి సరిగా వెళ్ళేవాడిని కాదని చెప్పారు. ఎగ్జామ్ ఫీజ్ కట్టమని మా అన్నయ్య 120 రూపాయలిస్తే.. ఈ రాత్రే ఇంట్లో చెప్ప‌కుండా బెంగ‌ళూరు నుండి చెన్నై వెళుతున్న‌ ట్రెయిన్ ఎక్కేశానని చెప్పారు. ఆ డబ్బుతో
    టికెట్ తీసుకున్నానని అన్నారు రజినీ.

    జేబులో చూస్తే టికెట్ లేదు.. టికెట్ క‌లెక్ట‌ర్ పట్టుకొని

    జేబులో చూస్తే టికెట్ లేదు.. టికెట్ క‌లెక్ట‌ర్ పట్టుకొని

    అయితే చెన్నైస్టేషన్ వచ్చాక.. నిద్ర‌లేచి అంద‌రితో పాటు బ‌య‌ట‌కు వ‌స్తుంటే టికెట్ క‌లెక్ట‌ర్ టికెట్ ఎక్క‌డ‌? అని అడిగాడని, జేబులో చూస్తే టికెట్ లేకపోవడంతో ఆ విష‌యాన్ని టికెట్ క‌లెక్ట‌ర్ కి చెప్పానని అన్నారు రజినీ. అయితే అతను నన్ను నమ్మకుండా `నువ్వు టికెట్ తీసుకోలేదు క‌దా! నిజం చెప్పు` అని నిలదీశారని అన్నారు.

    నా కోసం వాళ్ళు ముందుకొచ్చారు.. ఏడుపు రావ‌డం ఒక‌టే త‌క్కువ‌

    నా కోసం వాళ్ళు ముందుకొచ్చారు.. ఏడుపు రావ‌డం ఒక‌టే త‌క్కువ‌

    టికెట్ పొగొట్టుకున్నానని ఎంత చెప్పినా ఆయ‌న న‌మ్మలేదని రజినీ చెప్పారు. ఆ సమయంలో తనకు ఏడుపు రావ‌డం ఒక‌టే త‌క్కువ‌ అని చెప్పుకొచ్చారు. అయితే అక్కడున్న ఐదుగురు పోర్ట‌ర్స్ `ఆ అబ్బాయి నిజ‌మే! చెబుతున్నాడేమో? ఒక‌వేళ నిజంగా ఆ అబ్బాయి టికెట్ కొన‌క‌పొతే త‌ను క‌ట్టాల్సిన జ‌రిమానాని మేం క‌డ‌తాం` అన్నారని, చివరకు ఆ టికెట్ కలెక్టర్ వదిలేశాడని చెబుతూ ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు రజినీ.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    త‌మిళ గ‌డ్డ‌పై అలా అడుగుపెట్టా..

    త‌మిళ గ‌డ్డ‌పై అలా అడుగుపెట్టా..

    అలా ఆరోజు, ఆ టికెట్ క‌లెక్ట‌ర్‌, ఆ ఐదుగురు పోర్ట‌ర్స్ ఆ రోజు నాపై ఉంచిన న‌మ్మ‌కంతోనే తాను త‌మిళ గ‌డ్డ‌పై అడుగు పెట్టానని రజినీ చెప్పారు. అలా తనకు తెలియ‌ని వాళ్లే తనను ముందుగా న‌మ్మారని.. ఆ తర్వాత కె.బాల‌చంద‌ర్‌ గారు తనను న‌మ్మారని, అలా ఆయ‌న న‌మ్మ‌కం నిజ‌మైందని రజినీ పేర్కొన్నారు. అలాగే తనపై ప్రజలందరూ తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయనని అన్నారు రజినీకాంత్.

    English summary
    Super star Rajinikanth and Nayanatra playing lead rols on Darbar movie. In this movie Audio release event Rajinikanth says about his cine journey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X