»   » షాకింగ్: తన తాగుడు,సిగరెట్ సమస్య గురించి చెప్పిన రజనీకాంత్

షాకింగ్: తన తాగుడు,సిగరెట్ సమస్య గురించి చెప్పిన రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సాధారణంగా సెలబ్రెటీలు తమ గొప్పలు చెప్పుకోవాటనికి ఆసక్తి చూపుతారు కానీ, తమ బలహీనతలు, ముఖ్యంగా తాగుడు వంటి విషయాలు గురించి బయిటపెట్టడానికి ఇష్టపడరు. తమమీద ఉన్న ఇంప్రెషన్ పోతుందనో లేక మరొకటో కానీ, సెలబ్రెటీలు తాము మామూలు మనుష్యులం కాదు..దైవ స్వరూపాలు అన్నట్లుగా కనిపించటానికే ఇష్టపడతారు. అలాగే ఎక్సపోజ్ చేసుకుంటారు. కానీ రజని అందుకు వ్యతిరేకం.

సూపర్ స్టార్ గా తెరపై చెలరేగిపోయే రజనీకాంత్..నిజ జీవితంలోనూ నిరాడంబరత జీవితం గడిపేస్తుంటారు‌. ఆయన తన తాగుడు బలహీనత గురించి తాజాగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సీనియర్‌ నటుడు శివకుమార్‌ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిజేసేందుకు రాసిన ఓ లేఖలో రజనీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తనలోని చెడు వ్యసనాల్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు ఎటువంటి సంశయం వ్యక్తం చేయలేదు రజనీ.

Rajinikanth opens up about his drinking problem in a letter to veteran actor Sivakumar

ఆ లేఖలో శివకుమార్‌ గురించి ప్రస్తావిస్తూ.. 'కెరీర్‌ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకున్నాను. అప్పట్లో నాకు మద్యం, సిగరెట్‌ తాగే అలవాట్లుండేవి. గొప్ప నటుడిగా ఎదగాలంటే ముందు నువ్వీ అలవాట్లన్నీ మానేయమని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన మంచి సలహాలు చెప్పేవారు.

శివకుమార్‌ది ఓ మహోన్నతమైన వ్యక్తిత్వం. చెడు వ్యసనాలతో నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా. ఆయన ఇచ్చిన ఆరోగ్య సలహాలు పాటించి శారీరకంగా, మానసికంగా బలపడ్డా. అలాంటి వ్యక్తికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని రజనీ పేర్కొన్నారు.

1977లో వచ్చిన 'కవికూయిల్‌', 'భువన ఒరు కెల్వికురి' చిత్రాల్లో రజనీ, శివకుమార్‌లు కలిసి నటించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన సూర్య, కార్తీలు శివకుమార్‌ కుమారులు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇంట దీపావళి సందడి నెలకొంది. కుమార్తె ఐశ్వర్య, అల్లుడు, ధనుష్‌తో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను ఐశ్వర్య ధనుష్‌ అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ 'రోబో-2' చిత్రంలో నటిస్తుండగా, దీపావళి సందర్భంగా విడుదలైన ధనుష్‌ 'ధర్మయోగి'(తమిళంలో కోడి) చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

English summary
superstar Rajinikanth is known to be candid, honest and humble but he has taken it to a whole new level this time. In a letter addressed to veteran actor Sivakumar, he spoke about his relationship with the actor, the advice he had given him at that time and his major drinking problem
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu