For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ ఇండియా వచ్చేసారు (రీసెంట్ ఫొటోలు), అందుకోసమే అమెరికాలో స్టే?

  By Srikanya
  |

  చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు నెల రోజుల యుఎస్ వెకేషన్ తర్వాత తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్ తో కలిసి ఇండియాకు ఆదివారం(జూలై 24న) వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో రజనీని చూసిన కొందరు అభిమానులు ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చెన్నైలో రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత '2.0' షూటింగ్‌లో రజనీ పాల్గొంటారని సమాచారం.

  గత కొంత కాలంగా రజనీకాంత్ ఇండియా ఎప్పుడొస్తారు? రిలీజ్ టైమ్ కు కూడా ఎందురు రాలేదు, ఆడియో ఫంక్షన్ లో కూడా ఎందురు పాల్గొనలేదు అంటూ అనేక ప్రశ్నలు అభిమానుల్లో చర్చనీయాంశాలుగా మారాయి. దానికి తోడు మీడియా సైతం ..రజనీ అనారోగ్యంతో ఉన్నారని, కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారని రూమర్స్ స్ప్రెడ్ చేసింది.

  అప్పటికీ ఆయన కుమార్తె...అలాంటి వార్తలను ఖండించే ప్రయత్నం చేసారు. రోబో 2 నిర్మాత సైతం ఈ విషయమై రెండు మూడు సార్లు తనకు రజనీ ఫోన్ చేసారంటూ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఎవరు ఎన్ని చెప్పినా రజనీని కళ్లతో చూసేదాకా అభిమానులకు సందేహం తీరలేదు.

  దాంతో ఆయన ఇలా అమెరికా నుంచి ఇండియాకు రావటం ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్తగా మారింది. తలైవా (నాయకుడు) ఇండియా వచ్చేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. రజనీ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

  స్లైడ్ షోలో రజనీకాంత్ లేటెస్ట్ ఫొటోలు

  డీ టాక్సినేషన్ పోగ్రామ్

  డీ టాక్సినేషన్ పోగ్రామ్

  వెకేషన్ లో భాగంగా రజనీ..డీ టాక్సినేషన్ పోగ్రాంలో పాల్గొన్నారని తెలుస్తోంది.

  ఆశ్రమంలో

  ఆశ్రమంలో

  మధ్యలో రజనీ ఒకసారి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ విషయాన్ని ఐశ్వర్య ట్వీట్ చేసి ఫొటోలు అందించారు.

  అక్కడే

  అక్కడే

  ఇటీవల విడుదలైన ఆయన తాజా చిత్రం 'కబాలి'ని సైతం అమెరికాలోనే వీక్షించారు. ఆ ఫొటోలు బయిటకు వచ్చాయి.

  రిలీజ్ అయ్యాక, టాక్ వినే

  రిలీజ్ అయ్యాక, టాక్ వినే

  శనివారం సాయంత్రం రజనీ అమెరికా నుంచి చెన్నై ప్రయాణమయ్యి,బయిలు దేరి వచ్చేసారు

  నెగిటివ్ టాక్

  నెగిటివ్ టాక్

  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం ‘కబాలి' ఈ నెల 22వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అయితే నెగిటివ్ టాక్ మూట గట్టుకుంది.

  భారీ రిలీజ్

  భారీ రిలీజ్

  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 థియేటర్లలో విడుదలైంది.

  తొలిరోజే...

  తొలిరోజే...

  తొలిరోజు దేశంలో ఏకంగా రూ.250 కోట్ల వరకు కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

  తమిళంలో..

  తమిళంలో..

  తమిళనాడులో మాత్రమే రూ.100 కోట్లు; దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రూ.150 కోట్ల వరకు వసూలయ్యాయని పేర్కొన్నాయి.

  నిర్మాతే ప్రకటన

  నిర్మాతే ప్రకటన

  మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత థాణు ప్రకటించినట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి.

  అంతేకాకుండా

  అంతేకాకుండా

  విదేశాల్లో రూ.వంద కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

  రెండు రికార్డులు బ్రద్దలు

  రెండు రికార్డులు బ్రద్దలు

  గతంలో అజిత్‌ హీరోగా వచ్చిన ‘వేదాలం', విజయ్‌ నటించిన ‘కత్తి' రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాసిందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

  English summary
  Superstar Rajinikanth, who was on a month-long US vacation along with his daughter Aishwarya R Dhanush, returned to India on Sunday (July 24).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X