For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకాంత్ లాక్‌డౌన్‌లో ఏం చేశారో తెలిస్తే షాకే.. 100 రోజుల్లో సూపర్‌స్టార్ లైఫ్ ఇదే

  |

  కరోనావైరస్ దెబ్బకు సాధారణ పౌరుడి నుంచి సెలబ్రిటీ వరకు కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాణాంతక వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ గృహనిర్బంధంలో ఉంటున్న సెలబ్రిటీలకు సంబంధించిన హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువగానే కనిపించింది.

  అయితే సెలబ్రిటీలకు అతీతంగా వ్యవహరించే సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం సాధారణ జీవితాన్ని గడుపుతూ సమాజానికి, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 100 రోజులు స్వీయ గృహ నిర్బంధ జీవితంలో రజనీకాంత్ ఏం చేస్తున్నారనే విషయంపై అభిమానులకు ఆసక్తి కలగడం సాధారణమైన విషయమే. ఇంతకు సూపర్‌స్టార్ ఏం చేస్తున్నారంటే..

  పోయెస్ గార్డెన్ ఇంటి నుంచి..

  పోయెస్ గార్డెన్ ఇంటి నుంచి..

  చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన అధికార నివాసంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉంటారనేది అందరికి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ తర్వాత తన కుటుంబంతోపాటు రజనీ కెలంబాకంలోని ఫామ్‌హౌస్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్కడే అంతా సౌకర్యాలు, వసతులను ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. బయట నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు గానీ, కూరగాయలు, పండ్లు ఫామ్ హౌస్‌లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారట. తన ఫామ్‌హౌజ్‌లో పండిన సేంద్రియ ఫలాలు, కూరగాయాలను మాత్రమే ఉపయోగిస్తున్నారని సన్నిహితులు వెల్లడించారు.

  కెలంబాకం ఫాంహౌజ్‌లోనే 100 రోజులుగా

  కెలంబాకం ఫాంహౌజ్‌లోనే 100 రోజులుగా

  తన కెలంబాకం ఫాం హౌజ్‌లో రజనీకాంత్ కఠినమైన ఆంక్షల్ని విధించారట. బయట వ్యక్తులు లోపలికి రాకుండా.. లోపలి వ్యక్తులను బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారని సన్నిహితులు పేర్కొన్నారు.అలాగే ఇంట్లో పనిచేసే సిబ్బందిని లాక్‌డౌన్ ముగిసేంత వరకు అక్కడే ఉండాలని సూచించారట. ఆ మేరకు సిబ్బందితో కలిసి ఉంటూ వారి యోగ క్షేమాలను కూడా తెలుసుకొంటున్నారని సమాచారం.

  జూమ్‌, వాట్సప్‌లో స్నేహితులతో

  జూమ్‌, వాట్సప్‌లో స్నేహితులతో

  లాక్‌డౌన్ జీవితాన్ని మధురమైన అనుభవంగా మార్చుకొనే పనిలో రజనీకాంత్ ఉన్నారట. తన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో ఫోన్‌లో మాట్లాడటం, జూమ్ కాల్స్‌తో సుదీర్ఘంగా సంభాషించడం చేస్తున్నారట. వివిధ కారణాల వల్ల, సినిమా బిజీ షెడ్యూల్స్ కారణంగా కలుసుకోలేకపోయిన మిత్రులతో రజనీ వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాలతో కనెక్ట్ అవుతున్నట్టు తెలిసింది. పలు భాషల్లో సినిమాకు సంబంధించిన డెవలప్‌మెంట్స్, టెక్నాలజీ ఉపయోగాల గురించి అడిగి తెలుసుకొంటున్నారని తెలిసింది.

  ఓటీటీలో సినిమాలు చూస్తూ

  ఓటీటీలో సినిమాలు చూస్తూ

  ఇక షూటింగులు, తీరిక లేకుండా ఉండే సినిమాల పనులు, షూటింగులకు దూరంగా ఉంటున్న రజనీకాంత్.. ఇప్పుడు ఏకధాటిగా సినిమాలు చూస్తూ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారట. ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై పలు సిరీస్‌లను, సినిమాలను కుటుంబ సభ్యులతో చూస్తూ కాలాన్ని గడిపేస్తున్నట్టు సమాచారం. గతంలో చూడటానికి వీలు కానీ సినిమాలను కూడా చూసినట్టు తెలిసింది.

  అన్నాతే షూటింగ్‌కు నో..

  అన్నాతే షూటింగ్‌కు నో..

  ప్రస్తుతం అంటే.. కరోనా లాక్‌డౌన్ వరకు అన్నాతే సినిమా షూటింగులో రజనీకాంత్ బిజీగా ఉన్నారు. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన ఫస్టాఫ్ పూర్తిగా చిత్రీకరించారు. అయితే ఇంకా సెకండాఫ్ మాత్రం మిగిలిపోయింది. అయితే అన్నాతే సినిమా యూనిట్ షూటింగు ప్రయత్నాలకు సూపర్‌స్టార్ బ్రేక్ వేశారట. తమిళనాడులో కరోనావైరస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు షూటింగ్‌కు వచ్చే పరిస్థితి లేదు అని టీమ్‌కు స్పష్టం చేశారట.

  Kushboo Made Comments on Rajinikanth's Political Entry
  లోకేష్ కనకరాజ్‌కు సూచనలు, సలహాలు

  లోకేష్ కనకరాజ్‌కు సూచనలు, సలహాలు

  ఇక తమిళ చిత్ర పరిశ్రమలో చిరకాల మిత్రుడు కమల్ హాసన్‌తో సినిమాలు నిర్మించే విషయంపై రజనీకాంత్ దృష్టిపెట్టారు. మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతోపాటు మరికొన్ని స్ట్రిప్టులపై కసరత్తు చేయాలని లోకేష్‌కు సూచించారట. లాక్‌డౌన్ తర్వాత స్క్రిప్టులపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టనన్నట్టు వెల్లడించినట్టు సమాచారం.

  English summary
  Super Star Rajinikanth shifted from "poes garden" to "kelambakkam" to his farm house with entire family. He is avoiding entirely outside food, fruits, vegetables. Everything he is getting it from his farm house naturally. Also he is having long conversations over phone with his close friends about cinema and knowing latest news from them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X