»   »  'రోబో 2.0' ఆ విషయంలో మాత్రం 'బాహుబలి ' రికార్డ్ ని బ్రద్దలు కొట్టింది

'రోబో 2.0' ఆ విషయంలో మాత్రం 'బాహుబలి ' రికార్డ్ ని బ్రద్దలు కొట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో '2.0' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ చిత్రం రోబోకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంకి సంభందించిన ఓ ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ 2.ఓ చిత్రం తమిళం, హిందీ భాషల్లో 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్యూరెన్స్ చేసినట్లు తాజా సమాచారం. చిత్ర షూటింగ్‌లో జరిగే అసంభవాలు, విపత్తులు,సెట్‌ ప్రాపర్టీ నష్టం ,ప్రాణ హాని లాంటి సంఘటలకు పరిహారం పొందడానికి ఈ ఇన్యూరెన్స్ సాయపడుతుంది.

ఇటీవల కొన్ని సినిమా షూటింగ్‌లలో ప్రాణ నష్టం, ధన నష్టం కలుగుతుండడంతో 2.ఓ చిత్ర నిర్మాతలు ఇన్యూరెన్స్ చేసినట్లు తెలిసింది. ఈ ఇన్సూరెన్స్ ట్రెండ్ ..ఐశ్వర్యారాయ్ ...తాళ్ సినిమాతో మొదలైంది. అలాగే సల్మాన్ ఖాన్ కిక్ చిత్రానికి 300 కోట్లకు , రాజమౌళి..బాహుబలి చిత్రానికి 200 కోట్లకు ఇన్సూరెన్స్ చేయింటినట్లు సమాచారం.

Rajinikanth's 2.0 insured for Rs 350 crore; beats the record of SS Rajamouli's Baahubali 2

ఇప్పుడు ఆ రికార్డ్ లన్నిటినీ రోబో 2 బ్రద్దలు కొట్టేసింది. అయితే సినిమా ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇన్సూరెన్స్ డబ్బు రాదు. కేవలం విపత్తులు, ప్రాణ నష్టం, సెట్ ప్రాపర్టీ నాశనం వంటి వాటికే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

రోబో 2 చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు జరుగుతునట్లు సినీ వర్గాల సమాచారం. పలువురు హాలీవుడ్‌ కళాకారులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్‌లో రజనీకాంత్‌ పాల్గొంటున్నారు. ఏఆర్‌.రెహ్మాన్ గీత బాణీలు కడుతున్న 2.ఓ చిత్రాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి దర్శకుడు శంకర్‌ బృందం తీవ్రంగా కృషి చేస్తోంది.

ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరో బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని చెప్తున్నారు.

English summary
In recent years, Salman Khan's Kick had taken a cover of Rs 300 crore and SS Rajamouli's Baahubali – The Beginning was insured for Rs 200 crore. Now 2.0 makers have taken a cover of Rs 350 crore for the production cost alone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu