రోబో2.0 టీజర్ లీక్ గుట్టురట్టు.. చౌర్యం ఇలా.. ఆన్‌లైన్ దొంగలు ఎవరంటే..

By Rajababu

Recommended Video

Rajinikanth's 2.0 Leaked : Here's how 2.0 teaser actually got leaked

రోబో2.0 సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వర్క్స్ ఓ వైపు సాగుతుంటే.. మరోవైపు టీజర్ లీక్ కావడం చిత్ర యూనిట్‌కు దిమ్మతిరిగినంతపనైంది. నిమిషం నిడివి ఉన్న ఇంకా ఎడిట్ పూర్తికాని టీజర్‌ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత వెంటనే వాట్సప్, సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం చిత్ర నిర్మాతలకు షాక్ తగిలింది. అయితే టీజర్ రిలీజ్ కావడం వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడిన వారికి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

బర్త్‌డే పార్టీలో రికార్డింగ్

బర్త్‌డే పార్టీలో రికార్డింగ్

రోబో2.0 అన్ ఎడిట్ టీజర్‌ను మార్చి 2న జరిగిన లైకా చీఫ్ సుబాస్కరన్ బర్త్‌డే పార్టీలో ప్రదర్శించారు. ఆ పార్టీలోనే ఎవరో టీజర్‌ను రికార్డుచేసి ఆన్‌లైన్‌లో లీక్ చేసి ఉంటారు అని భావిస్తున్నారు. అయితే అధికారికంగా చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం.

 సెల్‌ఫోన్‌తో తీసి ఉంటారని

సెల్‌ఫోన్‌తో తీసి ఉంటారని

ఇంటర్నెట్‌లో లీకైన టీజర్‌ను సెల్‌ఫోన్‌తో తీసి ఉంటారనేది స్పష్టమైంది. సెల్‌ఫోన్‌తో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, దాని ముందు అటు ఇటూ కదలుతున్న కొందరు అందులో రికార్డు అయ్యారు. అంతేకాకుండా ఆ పార్టీకి హాజరైన అక్షయ్‌కుమార్ కూడా అందులో చూచాయగా కనిపించడం గమనార్హం.

 450 కోట్ల వ్యయంతో

450 కోట్ల వ్యయంతో

2010లో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్ 2.0 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ చిత్రంలో కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తున్నది.

 బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్

బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్

రోబో2.0 చిత్రం కోసం బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ తొలిసారి తమిళంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో డాక్టర్ రిచర్డ్ అనే విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఓ పక్షిరూపంలో ఉండే గెటప్‌లో అక్షయ్ కనిపిస్తారు.

 మూడుసార్లు రిలీజ్ వాయిదా

మూడుసార్లు రిలీజ్ వాయిదా

రోబో2.0 చిత్రం విడుదల ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. తొలుత గతేడాది డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకొన్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్‌కు మార్చారు. కానీ మళ్లీ ఈ సినిమాను వాయిదా వేసి ఆగస్టు 15న గానీ, దీపావళీకి గానీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X