»   » కబాలికి విమానం.. రోబో 2.0కు హాట్ బెలూన్.. అట్టహాసంగా ప్రచారం షురూ..

కబాలికి విమానం.. రోబో 2.0కు హాట్ బెలూన్.. అట్టహాసంగా ప్రచారం షురూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ చిత్ర పరిశ్రమలో గతంలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రోబో 2.0 చిత్ర ప్రమోషన్‌ను విభిన్నంగా ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుతున్నాయి. హాట్ బెలూన్‌తో రోబో 2.0 చిత్రం ప్రచారాన్ని నిర్వహించాలని చిత్ర నిర్మాత, దర్శకులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని పలు దేశాలను చుట్టివచ్చేలా ఈ బెలూన్‌ డిజైన్ చేశారు. రోబో చిత్రాలు ఉన్న బెలూన్ మీడియాకు ప్రదర్శించారు.

రోబో 2.0 చిత్ర యూనిట్ వినూత్న ప్రచారం

రోబో 2.0 చిత్ర యూనిట్ వినూత్న ప్రచారం

రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకొని బాహుబలి2 చిత్రం సంచలనం విజయం సాధించింది. విడుదల తర్వాత సరికొత్త రికార్డులను, ప్రమాణాలకు గీటురాయిగా బాహుబలి నిలిచింది. దాంతో దేశ సినీ పరిశ్రమలో పలు చిత్ర నిర్మాణ సంస్థలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ను సరికొత్తగా నిర్వహించి ప్రేక్షకులను ఆకర్షించాలన్న లక్ష్యంగా లైకా ప్రొడక్షన్ చర్యలు తీసుకొంటున్నది.

100 అడుగుల ఎత్తైన బెలూన్‌తో..

100 అడుగుల ఎత్తైన బెలూన్‌తో..

ఈ హాట్ బెలూన్ ఎత్తు 100 అడుగులు. ఈ బెలూన్‌ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బెలూన్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తాం. రోబో 2.0 చిత్రాన్ని హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాం. కావున ఈ బెలూన్‌ను లాస్ ఎంజెలెస్‌లోని హాలీవుడ్‌‌లో కూడా ప్రదర్శిస్తాం. అని లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం పేర్కొన్నారు.

పలు దేశాల మీదుగా ప్రయాణం..

పలు దేశాల మీదుగా ప్రయాణం..

ఈ బెలూన్ లండన్, దుబాయ్ ఆస్ట్రేలియా దేశాలతో మరికొన్ని దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ బెలూన్ ద్వారా బ్రహ్మండమైన ప్రచారాన్ని నిర్వహించాలని అనుకొంటున్నాం. అంతేకాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా దానితో ప్రచారం నిర్వహించాలనుకొంటున్నాం. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్‌తోపాటు మిగితా నటులు పాల్గొంటారు అని మహాలింగం తెలిపారు.

రోబో 2.0 కోసం బాహుబలి టీమ్

రోబో 2.0 కోసం బాహుబలి టీమ్

2010లో విడుదలైన రోబో చిత్రానికి సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కుతున్నది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొన్న రోబో 2.0 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రానికి బాహుబలి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, గ్రాఫిక్ టీం పనిచేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అక్షయ్ కుమార్ దక్షిణాది సినిమా రంగానికి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో విలన్‌గా అక్షయ్ కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా కనిపించనున్నది.

రజనీ సైంటిస్ట్.. అక్షయ్ పక్షి ప్రేమికుడిగా..

రజనీ సైంటిస్ట్.. అక్షయ్ పక్షి ప్రేమికుడిగా..

రోబో 2.0 చిత్రంలో రజనీకాంత్ సైంటిస్ట్‌గా నటిస్తుండగా, అక్షయ్ కుమార్ పక్షిశాస్త్ర నిపుణుడిగా కనిపిస్తారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

450 కోట్లతో రోబో 2.0

450 కోట్లతో రోబో 2.0

రోబో 2.0 చిత్ర బడ్జెట్ రూ.450 కోట్లు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను జీ నెట్ వర్క్ రూ.100 కోట్లు వెచ్చించి దక్కించుకోవడం సినీ పరిశ్రమలో రికార్డుగా నిలిచింది.

English summary
Lyca Productions, the makers of superstar Rajinikanth’s upcoming Tamil science-fiction action drama 2.o, are pushing the envelope as they begin the promotional campaign for the costliest Indian film. As part of the promotions, a hot-air balloon adorned with life-sized images of Rajinikanth and Akshay Kumar will travel around the world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu