»   » రాజసంగా రజనీకాంత్.. కాలా ఫస్ట్‌లుక్‌కే ఫ్యూజులు అవుట్

రాజసంగా రజనీకాంత్.. కాలా ఫస్ట్‌లుక్‌కే ఫ్యూజులు అవుట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై మహానగరాన్ని మరోసారి గడగడలాడించేందుకు అండర్ వరల్డ్ డాన్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రెడీ అయ్యాడు. గతంలో బాషా చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా తడాఖా చూపించిన తలైవా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో కాలా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫస్ట్‌లుక్‌తోనే కాలా సినిమా ఏంటో, దాని రేంజ్ ఎంటో అర్థమైపోయింది. ఈ చిత్రాలు సినీ అభిమానుల్లో మరోసారి భారీ అంచనాలను పెంచాయి.

రాజసంగా రజనీ..

రాజసంగా రజనీ..

తాజాగా రిలీజైన కాలా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో చుట్టూ ముంబై నగరం.. మధ్యలో జీపు.. దానిపై రజనీకాంత్ రాజసంగా కూర్చున్న లుక్ దుమ్మురేపుతున్నది. వెండితెరపై మరో ప్రభంజనానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చినట్టు కనిపిస్తున్నది.


నేర సామ్రాజ్యాన్ని శాసించే..

నేర సామ్రాజ్యాన్ని శాసించే..

ముంబై నగరంలో అరాచకాలపై ఆగ్రహం, రౌద్రం వ్యక్తం చేసే మరో పోస్టర్ మరింత అదరగొట్టేసింది. ముంబై నగరంలో నేర సామ్రాజ్యాన్ని శాసించిన మాఫియా డాన్ హాజీ మస్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


161వ సినిమా మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా

161వ సినిమా మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా

కాలా చిత్రం రజనీకాంత్ కెరీర్‌లో 161వ సినిమా. తలైవర్ రజనీకాంత్ నటించే చిత్రం మిర్జా హాజీ మస్తాన్ జీవిత కథ అనే వార్త వినిపిస్తున్నది. మస్తాన్ హైదర్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్ తమిళనాడుకు చెందిన ముస్లిం మతస్తుడు. తమిళ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం హాజీ మస్తాన్‌కు ఉంది.


హాజీ మస్తాన్ కథ ఇదే..

హాజీ మస్తాన్ కథ ఇదే..

హాజీమస్తాన్ ముంబైలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. స్మగ్లింగ్, సినిమాలకు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హవాలా కార్యక్రమాలతో ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని 1926 రెంయి 1994 వరకు ఏలిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ మాఫియా సంబంధాలతో హాజీ మస్తాన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు.English summary
Superstar Rajinikanth's latest movie Kaala first goes viral in Internet. Rajini is acting as Mafia Don again. This movie is directed by Pa Ranjith. This movie first look released on May 25th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu