»   » కబాలి రికార్డును బ్రేక్ చేసిన కాలా.. రజనీ టాప్ లేపడం ఖాయమట..

కబాలి రికార్డును బ్రేక్ చేసిన కాలా.. రజనీ టాప్ లేపడం ఖాయమట..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajini "Kaala" Breaks kabali Records దీంతో రజనీ టాప్ లేపడం ఖాయం..

రజనీకాంత్ కొత్త సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారంటే ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. అలాంటిది ఆయన నటించిన సినిమా విడుదలవుతుందంటే అభిమానుల్లో పట్టరాని సంతోషం కలుగుతుంది. అయితే రజనీ నటించి తాజా చిత్రం కాలా. గ్యాంగ్‌స్టర్ గా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తి చేసుకుంది. షూటింగ్ విషయంలో ఈ చిత్రం కబాలి రికార్డును అధిగమించిందనే విషయాన్ని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

తక్కువ సమయంలో..

తక్కువ సమయంలో..

రజనీ నటించిన చిత్రాల్లో చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంగా కాలా రికార్డు సష్టించనుంది. గతంలో వచ్చిన కబాలీ చిత్రాన్ని కాలా అధిగమిస్తుంది. రజనీ కెరీర్‌లోనే కాలా అద్భుత చిత్రంగా నిలుస్తుంది అని ఆ చిత్ర యూనిటి వర్గాలు పేర్కొన్నాయి.

మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా..

మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా..

కబాలీ, కాలా ఈ రెండు చిత్రాల్లో రజనీ గ్యాంగ్‌స్టర్ గానే నటించారు. కబాలిలో మలేషియాలోని డాన్ నటిస్తే.. కాలాలో రజనీ ముంబైలో తమిళ డాన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలోని మొదటి భాగంలో రజనీ ముంబై రావడం ఆ తర్వాత తమిళ డాన్‌గా ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసించడం ఉంటుంది.

బాలీవుడ్ ప్రముఖులతో..

బాలీవుడ్ ప్రముఖులతో..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖులు భారీగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి హీరోయిన్ నటిస్తుండగా, విలక్షణ నటుడు నానా పటేకర్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వీరే కాకుండా ప్రముఖ నటులు చాలా మంది ఈ చిత్రంలో భాగమయ్యారు.

నిర్మాతగా ధనుష్

నిర్మాతగా ధనుష్

కబాలి దర్శకుడు పా రంజిత్ కాలా చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రజనీ పెద్దల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. పా రంజిత్, రజనీ కాంబినేషన్ లో మొదట వచ్చిన కబాలి చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

రోబో ముందా కాలా ముందా..

రోబో ముందా కాలా ముందా..

ఇదిలా ఉండగా రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రం విడుదలపై రజనీ అభిమానులు భారీ ఆశలతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. దీంతో కాలా చిత్రం విడుదల 2.0 చిత్రానికి ముందా లేదా ఆ తర్వాత ఉంటుందా? అనే విషయంపై క్లారిటీ లేదు.

 రాజకీయ ప్రవేశానికి ముందుగా..

రాజకీయ ప్రవేశానికి ముందుగా..

రజనీ రాజకీయ ప్రవేశం చేస్తారనే ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాలా, రోబో 2 చిత్రాలు కీలకంగా మారాయి. ఇప్పటికే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. కమల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు ఊపందుకొన్నాయి. దీంతో రజనీ అభిమానులు ఆయన సినిమాల కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు.

English summary
As much as 70 per cent of superstar Rajinikanth‘s upcoming Tamil gangster drama “Kaala” has been completed. The pace at which it is being shot could make it the fastest shot film in director Pa. Ranjith’s career, a source has said. Looks like Rajinikanth’s Kaala Kalikaaran is on its way to create its first record. It has beat Kabali to become the first Rajinikanth film to be shot at this kind of pace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu