»   » రజనీ 'కబాలి' కి విలన్ ఎక్కడివాడంటే...

రజనీ 'కబాలి' కి విలన్ ఎక్కడివాడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'కబాలి'. ఇందులో రాధికాఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. దన్షిక, రిత్వికా, దినేష్‌, కలైయరశన్‌, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు, నటీనటుల ఎంపికను దర్శకుడు రంజితకే వదిలేయడంతో.. రజనీతో ఇదివరకు చేయన్ నటులు పలువురు ఇందులో కనిపించనున్నారు.

ముఖ్యంగా సినిమాలో హైలెట్ గా నిలిచే విలన్‌ పాత్రను కూడా మలేషియా నటుడికే అప్పజెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీంతో స్థానికంగా మరింత అంచనాలు పెరిగాయి 'కబాలి'కి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rajinikanth’s Kabali will have a Surprise Villain

ప్రస్తుతం ఈ సినిమా సన్నివేశాలను మలేషియాలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీపావళి పండుగను కూడా రజనీకాంత్‌ అక్కడే అభిమానుల మధ్య జరుపుకున్నారు. 75 శాతం సన్నివేశాలను మలేషియాలో షూటింగ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా సినిమాలో పలువురు మలేషియా నటులు కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం.

ఈ సినిమాకు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. మలేషియా, సింగపూర్‌ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా స్థానికంగా రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న టార్కి కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈయనతోపాటు మరో ముగ్గురు మలేషియా నటులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Rajinikanth’s Kabali will have a Surprise Villain

రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కబాలి' . తెలుగులోనూ విడుదల కానున్న ఈ సినిమాకి 'మహదేవ్‌' అనే పేరును నిర్ణయించినట్టు తెలిసింది. రజనీకాంత్‌ ఈ చిత్రంలో మాఫియా లీడర్‌గా, ఆయనకి భార్యగా రాధికా ఆప్టే నటిస్తున్నట్గు తెలిసింది. ఈ చిత్రం కోసం రజనీ తెల్లటి గెడ్డంతో ప్రత్యేకమైన లుక్‌తో కనిపిస్తున్నారు.

ఇక 'కబాలి' ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Super Star Rajinikanth’s Kabali movie is set to feature a new villain from Malaysia , details are not revealed . Rajinikanth is busy working for his new venture 'Kabali'. 'Mahadev' for Telugu version of the film and the posters with the film's title will be out soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu