twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ కాంత్ ప్యాన్స్ కు చేదు వార్తే

    By Srikanya
    |

    చెన్నై:సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'కోచ్చడయాన్' (తెలుగులో 'విక్రమసింహా') సినిమా విడుదల మరింత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుక నిజానికి రజనీకాంత్ జన్మదినం సందర్భంగా గురువారం (డిసెంబర్ 12) జరగాల్సి ఉంది. కానీ ఆ వేడుకను కూడా జనవరి మొదటి వారానికి వాయిదా వేశారు.

    ఈ సంగతిని తమిళ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్లై ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. శ్రీధర్ పిళ్లై ట్వీట్ లో ... "ఈ సినిమా విడుదల 2014 ఏప్రిల్‌కు మారింది'' అని చెప్పారు. దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, శోభన, నాజర్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్' తరహాలో మోషన్ కాప్చర్ 3డి టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. కె.ఎస్. రవికుమార్ రచన చేయగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాని హిందీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లోనూ అనువదిస్తున్నారు.

    'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

    రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. కానీ ఫలితం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతోంది.

    'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

    English summary
    
 The release date of Superstar Rajinikanth's most-anticipated Kochadaiyaan was originally stated to be December 12, his birthday, this year. But, now reports claim that the makers are planning to release the film in April, next year. Also, the music is to be released in February. Directed by the actor's daughter Soundarya R. Ashwin, the story has been written by KS Ravikumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X