»   »  ఆగస్టు 2 ...రజనీ ఫ్యాన్స్ కు పండుగే, కానీ ఎన్నో డౌట్స్

ఆగస్టు 2 ...రజనీ ఫ్యాన్స్ కు పండుగే, కానీ ఎన్నో డౌట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఆగస్టు 2వ తేదీ రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండుగ తేదీ కానుంది. ఆయన కొత్త చిత్రం ఆ రోజు ఓపెన్ అవుతోంది. గత కొద్ది రోజులుగా రజనీకాంత్ ఫ్యాన్స్ చూస్తున్న ఎదురుచూపులుకు టైం వచ్చింది. అయితే వారి అభిమానులకు అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఏమిటీ అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎప్పుడూ తమ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడెప్పుడు నటిస్తారా . అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూంటారు. దానికి తోడు రీసెంట్ చిత్రం 'లింగ' అంచనాలు తలక్రిందులు చేసి ఫ్లాప్ కావటంతో తదుపరి చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఎవరూ వూహించనివిధంగా ఆయన కొత్త దర్శకుడు రంజిత్‌కు అవకాశమిచ్చారు.

దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది?.. శీర్షిక ఏంటి?.. రజనీకాంత్‌ సరసన ఎవరెవరు నటిస్తున్నారు?.. రంజిత్‌ శైలిలో వాస్తవిక సినిమానా?.. అంటూ పలు రకాల ఆలోచనలో పడ్డారు అభిమానులు. సూపర్‌స్టార్‌ కొత్త చిత్రానికి ఆగస్టు రెండోతేదీన కొబ్బరికాయ కొట్టనున్నారు.

Rajinikanth's Next film to Hit the Floors on 2 August

గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన కథతో రూపొందించనున్నట్లు కోడంబాక్కం సమాచారం. రజనీకాంత్‌ ఓకే చెప్పిన వెంటనే.. రంజిత్‌ ప్రస్తుతం విదేశాల్లో లొకేషన్లు వెతికే పనిలో ఉన్నారు.

ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.

రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు.

తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.

English summary
The date of the launch of Rajinikanth's next movie with Pa Ranjith seems to have been fixed. Well, the Tamil flick will hit the floors on 2 August.
Please Wait while comments are loading...