»   » రజనీ కొత్త చిత్రం ఓపినింగ్ రద్దు

రజనీ కొత్త చిత్రం ఓపినింగ్ రద్దు

Written By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీ కాంత్ పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకు పండుగ రోజే. అందుకే... డిసెంబర్ 12 సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు చాలా ప్రత్యేకమై రోజు. ఏడాది మొత్తం ఈ రోజు కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటారు. సాధ్యమైనంత ఘనంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అందు కోసం నెల రోజులు ముందే సన్నాహాలు మొదలుపెట్టేస్తారు. అయితే అలేంటివేమీ లేనట్లే అని తేలిపోయింది.

rajanikanth 2

ఈ పుట్టినరోజుకి రజనీకాంత్ 65వ పడిలోకి అడుగుపెడతారు. ఈ బర్త్‌డేని ఘనంగా జరపాలనుకున్నారు అభిమానులు. అయితే, రజనీ సెలబ్రేట్ చేసుకునే మూడ్‌లో లేరు. అంటువంటివేమీ వద్దని క్లియర్ గా చెప్పేసారట. అందుకు కారణం తమిళనాడుని ముంచెత్తిన వరదలు. భారీ వర్షాల కారణంగా తమిళనాడు ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకోకూడదని రజనీ నిర్ణయించుకున్నారని సమాచారం.

దాంతో ఆ రోజు ఆయన కొత్త చిత్రం ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. సూపర్ హిట్ చిత్రం 'రోబో'కి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్ 'రోబో-2'ను ప్లాన్ చేస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే ఈ చిత్రాన్ని రజనీ పుట్టినరోజు నాడు లాంఛనంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపాలనుకున్నారట. అయితే, ఈ వేడుకకు వద్దనుకున్నట్లు సమాచారం.

rajanikanth

ఒకవైపు రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోవడంతో కొత్త సినిమా ఏం ప్రారంభిస్తామని దర్శక,నిర్మాతలతో చర్చించినట్లు సమాచారం. అందుకని ఆ రోజు పూజా కార్యక్రమాలు జరపాలనుకున్న ఆలోచనను విరమించుకున్నారు. అభిమాన హీరో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోవడం, 'రోబో-2' ఆరంభం వాయిదా పడటం అభిమానులను ఒకింత నిరాశపరిచే విషయమే.

English summary
Rajinikanth's "Robo- 2", which was supposed to be launched on 12 December to coincide with the superstar's birthday, is likely to be delayed. The unprecedented rain in Chennai, leading to deadly floods is said to be the reason behind the possible postponement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu