»   » రజనీకాంత్ 'రొబో' రిలీజ్ ఎప్పుడంటే...

రజనీకాంత్ 'రొబో' రిలీజ్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్‌, ఐశ్వర్యరాయ్‌ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు శంకర్‌ రూపొందిస్తున్న 'రోబో" ఆగస్టులో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ తన డ్రీమ్‌ ప్రోజెక్ట్‌గా 125 కోట్ల రూపాయల వ్యయంతో భారీగా తెరకెక్కించారు. ఇప్పటికే తొంభై శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ చిత్రానికి ఎ ఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. ఇక ఇంతకుముందు రజనీతోనే శంకర్ ..శివాజి చిత్రం రూపొందించి కమర్షియల్ గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. జెంటిల్ మెన్ నుంచి అపరిచితుడు వరకూ ఆయన చిత్రాలు వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నవే కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో జె.డి చక్రవర్తి విలన్ గా చేస్తున్నారని తెలుస్తోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu