»   » రజనీ 'విక్రమ్ సింహా‌' విడుదల తేదీ ఖరారు

రజనీ 'విక్రమ్ సింహా‌' విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త చిత్రం 'కోచ్చడయాన్‌'(విక్రమ్ సింహా) విడుదల తేదీ దాదాపు ఖరారు అయినట్లే. ఈ చిత్రం ఏప్రియల్ 11న విడుదల అయ్యే అవకాసం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ తేదీ కాదని మే 1 విడుదల చేయటానికి సన్నాహాలు చేయటానికి సిద్దపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఏర్పాటు మొదలయ్యాయి. రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ బాణీలు అందించారు.

మరో ప్రక్క ఈ చిత్రం ప్రచారంలో వినూత్నంగా ముందుకుసాగుతోంది. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, పంజాబీ, బోజ్‌పురి, మరాఠీ భాషలలో విడుదల చేయనున్నారు. మరో వైపు ఈ చిత్ర ప్రచారానికి గాను 3650 హోర్డింగులు, బ్యానర్లను తమిళనాడుతోపాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని భారత్‌ పెట్రోలియం బంకుల వద్ద ఏర్పాటు చేయనున్నారు. చెన్నైలో మాత్రమే వంద హోర్డింగులు అమర్చుతున్నారు. పెర్‌ఫార్మన్స్‌ మోషన్‌ క్యాప్చరింగ్‌ విధానంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది.

Rajinikanth's Vikram Simha now to release on May 1

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతోంది.

'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary
The release of the long-awaited Kochadaiiyaan starring Rajinikanth has been postponed yet again. The new release date, according sources very close to the project, is May 1.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu