»   »  రజనీ 'విక్రమసింహ' పాటల వేడుక-1 (ఫోటోలలో)

రజనీ 'విక్రమసింహ' పాటల వేడుక-1 (ఫోటోలలో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: రజనీకాంత్‌ హీరోగా రూపొందిన చిత్రం 'కోచ్చడయాన్‌'. తెలుగులో 'విక్రమసింహ'గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం పాటల విడుదల వేడుక చెన్నైలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ అందుకున్నారు.

  పెర్ఫార్మెన్స్‌ క్యాప్చర్‌ ఫొటో రియలిస్టిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రాన్ని 12 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో దేశీయ భాషలు తొమ్మిది, విదేశీ భాషలు మూడు ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణే నాయిక. రజనీ తనయ సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్‌ లుల్లా నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందించారు.

  ''నేను ఇప్పటివరకు 150 పైచిలుకు చిత్రాల్లో నటించాను. అయితే చారిత్రక నేపథ్యమున్న చిత్రంలో నటించలేదనే లోటు ఉండేది. దీన్ని నెరవేర్చుకోవడానికి 20 ఏళ్లు శ్రమించి.. నేనే 'రాణా' కథను తీర్చిదిద్దుకున్నాను. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యాక.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. దీంతో ఆ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు నా కూతురు సౌందర్య వల్ల నా కోరిక నెరవేరింది'' అన్నారు రజనీకాంత్‌.

  ఆడియో లాంచ్ విశేషాలు స్లైడ్ షోలో..

  షారూఖ్ ప్రత్యేకం

  షారూఖ్ ప్రత్యేకం

  బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఈ వేడుకకు హాజరుకావటంతో జాతీయ స్ధాయిలో ఈ ఆడియో వేడుక పెద్ద పంక్షన్ గా మారింది. ఓ సూపర్ స్టార్ సినీ ఆడియోకు మరో సూపర్ స్టార్ హాజరుకావటం విశేషంగా చెప్పుకుంటున్నారు.

   అంతా ఒక చోటే...

  అంతా ఒక చోటే...

  దర్శకుడు కె.ఎస్ రవికుమార్, రజనీకాంత్, షారూఖ్ ఖాన్, దీపికా పదుకోని ఈ పంక్షన్ లో ఒక చోట కలవటం వారి అభిమానులకు పండగలా మారింది.

  శంకర్

  శంకర్

  రజనీకాంత్ తో గతంలో రోబో,శివాజి చిత్రాలు అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ ఆడియో పంక్షన్ కి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆయన్ను రజనీ దంపతులు సాదరంగా ఆహ్వానించారు.

  ఫ్యాన్స్ కు...

  ఫ్యాన్స్ కు...

  రజనీకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు విషయం కాదు. వారందికి ఆయన చేతులు ఊపి లోపలకి వచ్చారు. ఆయన్ను చూడటానికి జనం ఎగబడ్డారు.

  లెజండ్స్ అంతా...

  లెజండ్స్ అంతా...

  తమిళ చిత్ర పరిశ్రమలో లెజండ్స్ అనదగ్గ బాలచందర్, అటు రజనీకాంత్ ఒకే చోట ఉండటం అందరికీ ఆనందమయ్యింది. రజనీ అల్లుడు ధనుష్ ఆయనతో మాటలు కలుపుతూ కనపడ్డారు.

  ఎంట్రీ...అదిరింది

  ఎంట్రీ...అదిరింది

  ఈ ఫంక్షన్ కి రజనీ ఎంట్రీ ఇస్తూ ఇలా అందరికీ అభివాదం చేసారు. ఒక్కసారిగా ఆ పంక్షన్ హాల్ అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది

  లిరిక్ రైటర్ తో...

  లిరిక్ రైటర్ తో...

  ప్రముఖ తమిళ సినీ పాటల రచయిత తో రజనీ కూర్చుని ఉన్నారు. రెగ్యులర్ గా రజనీ చిత్రాలకు ఆయనే రాస్తూంటారు.

  దర్శకురాలి దర్శనం

  దర్శకురాలి దర్శనం

  ఈ చిత్రం దర్శకురాలైన సౌందర్య రజనీకాంత్ ఈ వేడకలో హడావిడిగా కనిపించారు. ఆమె స్వయంగా దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షించారు.

  కళ్లు పెద్దవి చేసి...

  కళ్లు పెద్దవి చేసి...

  చిత్రం హీరోయిన్ దీపికా పదుకోని ఈ పంక్షన్ లో ఇలా కళ్లు పెద్దవి చేసి మరీ చూస్తూ ఎంజాయ్ చేసింది. గతంలో షారూఖ్ ,దీపికా కాంబినేషన్ లో చెన్నై ఎక్సప్రెస్ వచ్చింది. వీరిద్దరూ ఇలా ప్రక్క ప్రక్కనే కూర్చుని ఉన్నారు.

  గెస్ట్ ...

  గెస్ట్ ...

  ఈ ఆడియో పంక్షన్ కి ప్రత్యక గెస్ట్ ఎవరూ అంటే లతా రజనీకాంత్ అని చెప్పాలి. ఆమె తన కూతురు దర్శకత్వం..అటు భర్త హీరో సినిమా కావటంతో చాలా ఆనందించారు.

  జాకీ షరాఫ్...

  జాకీ షరాఫ్...

  ఈ సినిమాలో నటిస్తున్న జాకీ షరాఫ్ సైతం ఈ ఆడియో పంక్షన్ కి వచ్చారు. ఆయన్ను రజనీ సాదరంగా ఇలా ఆహ్వానించారు.

  వీళ్లీద్దరూ...

  వీళ్లీద్దరూ...

  రజనీకాంత్ మరో కుమార్తె ఐశ్వర్య తన భర్త ధనుష్ తో కలిసి ఈ ఫంక్షన్ కి హాజరైంది. వీళ్లిద్దరూ కలిసి కెమెరాకు ఇలా ఫోజిచ్చారు.

  పాటల మాంత్రికుడు...

  పాటల మాంత్రికుడు...

  పాటల మాత్రికుడు ఎఆర్ రహమాన్, పాటల రచయిత వైరముత్తు, ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలా మాట్లాడుకుంటూ ఈ పంక్షన్ లో కనిపించారు.

  English summary
  
 The audio of Rajinikanth’s upcoming film, Vikramasimha was launched in style in Chennai . Shah Rukh Khan was the chief guest at the event and several other eminent guests like K Balachander, Shankar, K S Ravikumar Vairamuthu, Deepika Padukone, Sarath Kumar, Jackie Shroff graced the event, apart from A R Rahman, Soundarya Rajinikanth and Rajinikanth himself. The album has nine songs and the audio has already received good response from music lovers. A R Rahman has scored the music and the film is going to release in the second week of April.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more