»   » హజారే నిజమైన హీరో: రజనీకాంత్

హజారే నిజమైన హీరో: రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవినీతిపై ఉద్యమం చేస్తూ, దేశ ప్రజల్లో చైతన్యం తెస్తున్న అన్నా హజారే నిజమైన హీరో అంటూ...సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం వ్యాఖ్యానించారు. అవినీతి నిర్మూలనకు 'జన్‌లోక్‌పాల్ బిల్లు" తేవడంలో భాగంగా హజరే చేస్తున్నఉద్యమం స్పూర్తి దాయకమని, ఆయనకు తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి భూతాన్ని తరిమికొట్టడాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని ముందుకు రావాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు.

హజారే లాంటి పోరాట పటిమ ఉన్న ఉద్యమకారులు దొరకడం దేశ ప్రజల అదృష్టమని, ఆయన చేస్తున్న పోరాటానికి తప్పకుండా ఫలితం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హజారేకు మద్దతుగా నిలుస్తున్న భారతీయులకు రజననీ ఆభినందనలు తెలిపారు.

English summary
Superstar Rajinikanth has come out strongly in support of Anna Hazare and his campaign for an effective Jan Lokpal Bill. India Against Corruption today released a statement from the superstar in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu