దేశానికి అవినీతి పెద్ద సమస్య, అన్నాహజారేతో కలిసి పని చేస్తా: రజనీకాంత్
అవినీతిరహిత భారత దేశం కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ బుధవారం స్పష్టం చేశారు. అవినీతిని పారద్రోలడానికి అన్నాహజారేతో కలిసి పని చేస్తానని చెప్పారు. అవినీతి మన దేశానికి పెద్ద సమస్యలా తయారయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని పారద్రోలడానికి అందరూ కంకణం కట్టుకోవాలన్నారు.
కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఎన్నుకోబోయే కొత్త ముఖ్యమంత్రి తమిళనాడు ప్రజల సంక్షేమానికి పాటుపడాలని కోరారు. తమిళనాడులో జరుగుతున్న ఈ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా చెన్నైలో రజనీకాంత్ తన ఓటును వేశారు.


Click it and Unblock the Notifications











