twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ భారీగా తగ్గాడు.. అలా కోతపెట్టేసుకొన్నాడు.. మళ్లీ ఆ వివాదం తెరపైకి?

    |

    Recommended Video

    Rajinikanth To Slash His Fee For AR Murugados's Movie..? | Filmibeat Telugu

    లేటు వయసులో కూడా వరుస చిత్రాలతో సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. గత మూడు సంవత్సరాలలో కబాలి, కాలా, 2.0, పేటా లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా విడుదలైన పేటా రికార్డు కలెక్షన్లను సాధించాడు. ఇక అదే ఊపులో దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నది. వివరాల్లోకి వెళితే..

    పొలిటికల్ డ్రామాతో రజనీకాంత్

    పొలిటికల్ డ్రామాతో రజనీకాంత్

    గతంలో ఎన్నడూలేని విధంగా రజనీకాంత్‌ వరుసగా 90 రోజుల కాల్షీట్‌ను కేటాయించాడు. ఏకధాటిన జరిగే షూటింగ్‌లో పాల్గొంటాడు. రాజకీయ కథా నేపథ్యంతో తెరకెక్కే చిత్రం అనేక మాస్ అంశాలు జొప్పించినట్టు సమాచారం. త్వరలోనే సినిమాను ప్రారంభించి సెట్స్‌పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అధికారికంగా త్వరలోనే ప్రకటన రానున్నది.

     లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో

    లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో

    రజనీకాంత్ నటించబోయే రాజకీయ ప్రాధాన్య చిత్రానికి నార్కాలి (పీఠం) అనే టైటిల్‌ను పెట్టినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ టైటిల్ కాదని ఏఆర్ రెహ్మన్ వివరణ ఇచ్చారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్నది. ఇటీవల విడుదలైన 2.0 చిత్రాన్ని అత్యధిక బడ్జెట్‌తో లైకా నిర్మించిన సంగతి తెలిసిందే.

    రజనీకాంత్ రెమ్యునరేషన్‌లో కోత

    రజనీకాంత్ రెమ్యునరేషన్‌లో కోత

    మురుగదాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం కోసం రజనీకాంత్ తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకొన్నారట. అయితే ఏ కారణంగా తన పారితోషికాన్ని తగ్గించుకొన్నాడనే విషయంపై క్లారిటీ లేదు. ఎందుకంటే పేటా చిత్రం సుమారు రూ.200 కోట్ల వసూలు సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన తర్వాత రజనీ ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకొన్నాడనే విషయం చర్చనీయాంశమైంది.

     రజనీకాంత్ మార్కు డైలాగ్స్‌తో

    రజనీకాంత్ మార్కు డైలాగ్స్‌తో

    లైకా, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్, ప్రముఖ సాంకేతిక నిపుణులతో రూపొందనున్నది. సమకాలీన రాజకీయాలపై రజనీ మార్కు డైలాగులతో సినీ విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రం కోసం ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు ఖరారైనట్టు సమాచారం.

    మళ్లీ ఆ వివాదం తెరపైకి

    మళ్లీ ఆ వివాదం తెరపైకి

    లైకా నిర్మాణ సంస్థపై తమిళ ప్రేక్షకులు, సంఘాలు నిరసన వ్యక్తం చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. శ్రీలంక మాజీ ప్రధాని మహీంద్ర రాజపక్సెకు లైకా ప్రొడక్షన్‌కు లింకు ఉందనే విషయంపై తమిళ సంఘాలు మండిపడ్డాయి. ప్రస్తుతం రజనీకాంత్ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో మళ్లీ అలాంటి వివాదాలు చెలరేగుతాయా అనే విషయం మళ్లీ చర్చలోకి వస్తున్నది.

    English summary
    Superstar Rajinikanth has agreed to slash his fee for this project. The film is supposed to be a political drama with fantasy thrown in. Some days back, rumors circulated that it was titled Naarkaali but Murugadoss dismissed the reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X