»   » రజనీకాంత్ ఉదార స్వభావము-యూనిట్ సభ్యుల ప్రశంశలు!

రజనీకాంత్ ఉదార స్వభావము-యూనిట్ సభ్యుల ప్రశంశలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సరైన సమయంలో సరైన విధంగా స్సందించే స్టైల్ ఉన్న అతికొద్దిమంది హీరోల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. పలు సందర్భాల్లో చిత్ర యూనిట్ సభ్యుల్ని ఆనంద పరచడం ఆయన ఆనవాయితీ. విషయమే మంటే 'రోబో" చిత్రానికి పనిచేసిన యూనిట్ సభ్యుల పట్ల తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రోబో" దాదాపు 120 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందుతోంది.

ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ చిత్రం ప్యాచ్ వర్క్ గత కొద్ది రోజులుగా చెన్నై లో జరుగుతోంది. ఈ సందర్భంగా రజనీ ఒకరోజు షూటింగ్‌ పూర్తయిన వెంటనే యూనిట్‌ సభ్యుల కోసం స్పెషల్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఒక ప్రముఖ వంటగాడ్ని రప్పించి నోరూరించే వంటకాలు రెడీ చేయించారు. స్వయంగా ఆయనే వడ్డనకు దిగి ఒక్కొరినీ పేరుపేరునా పలకరించి వంటకాలు కొసరి కొసరి తినిపించారు. సూపర్‌స్టార్‌ అనే అహం లేకుండా వారితో కలిసిపోయి మాట్లాడారు. తమను గుర్తించుకునే నటులు ఇలా కొంతమందే ఉంటారని చిత్ర యూనిట్‌ సభ్యులు రజనీకాంత్‌ను ప్రశంసించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu