»   » రజనీకాంత్ 'సుల్తాన్' ఏ స్టేజీలో ఉంది?

రజనీకాంత్ 'సుల్తాన్' ఏ స్టేజీలో ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను యానిమేషన్ క్యారెక్టర్ లో చూపిస్తూ ప్రతిష్ఠాత్మకంగా 'సుల్తాన్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ 60 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఓచర్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్, బిగ్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించనున్నారు. 95 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో ఇంగ్లీషు, తమిళ, హిందీ, తెలుగు తదితర 18 భాషల్లో 3500 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆస్కార్, గ్రామీ అవార్డుల గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించిన 'సుల్తాన్ ది వారియర్' యానిమేషన్ చిత్రం ఆల్బమ్ త్వరలోనే విడుదల కానుంది.మరో ప్రక్క శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందున్న రోబో చిత్రం కూడా ఫినిషింగ్ స్టేజీలో ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ఐశ్వర్యారాయ్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ లా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu