»   » శక్తికొద్ది చేసారు...ఫ్యాన్స్ కు రజనీ ధాంక్స్

శక్తికొద్ది చేసారు...ఫ్యాన్స్ కు రజనీ ధాంక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: వరద ముంపునకు గురైన చెన్నై కోసం విరాళాలు, ఇతర సహాయక చర్యలు చేపట్టిన ప్రతి అభిమానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఎప్పుడూ తన పుట్టినరోజున అభిమానులతో కలసి ఆయన మాట్లాడేవారు. ఈ సారి వేడుకలు నిర్వహించవద్దని సూచించారు.

శనివారం ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలను ట్విట్టర్‌లో చెప్పారు. వాటికి సూపర్‌స్టార్‌ స్పందించారు. చెన్నైకి సహకరించిన తన అభిమానుల కోసం ఆయన ట్విటర్‌లో సందేశాన్ని ఉంచారు.

Rajinikanth Thanks Fans For Helping Chennai

‘‘చెన్నై ప్రజలు సహాయం కోసం ఎదురుచూసిన తరుణంలో వారికోసం తమ శక్తికొద్దీ అందించిన నా అభిమానులకు మనసారా కృతజ్ఞతలు. దీనికి మించిన ఆనందం నాకు ఏదీ ఉండదు. చాలా సంతోష పడుతున్నా. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, సినీ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు''అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

English summary
Superstar Rajinikanth, took to Twitter to express his love for his fans who helped flood-hit Chennai to get back to normalcy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu