For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ అమెరికాలో లేటెస్ట్ ఫొటోలు ఇవిగో, డౌట్స్ తీరినట్లేనా?

  By Srikanya
  |

  చెన్నై :గత కొద్ది రోజులుగా రజనీకాంత్ అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం కబాలి ప్రమోషన్ కు సైతం రాలేదు. దాంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల అనుమానులు వచ్చి కధనాలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. అప్పటికీ రోబో 2 నిర్మాత తనకు రజనీ ఫోన్ చేసారని చెప్పినా ఎవరూ నమ్మలేదు.

  అయితే తాజాగా ఆయన అమెరికాలోని గురు సచ్చిదానంద లోటస్ ఆల్ ఫెయిత్స్ టెంపుల్ ని తన కుమార్తె సౌందర్యతో పాటు విజిట్ చేసారు. వర్జీనియాలో ఉన్న యోగవిల్లా 30 వ ఏనవర్శరీ సందర్భంగా రజనీ అక్కడికి వెళ్లారు . ఆ ఫొటోలను ఆయన కుమార్తె ట్విట్టర్ లో షేర్ చేసి రజనీ అభిమానులకు ఆనందం కలిగించింది.

  ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రోబో 2.0 సినిమా తొలి షెడ్యూల్ కంప్లీట్ కాగానే వెంట‌నే త‌న ఫ్యామిలీతో క‌లిసి అమెరికా వెళ్లారు. ఆయ‌న అమెరికా వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఆరోగ్యం పై ర‌క‌ర‌కాల వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం క‌బాలీ. ఈ చిత్రం ఈ నెల 22 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

  మ‌ల‌యాళంలో ఈ చిత్ర రిలీజ్ కు రెండు రోజుల ముందు ప్ర‌మోష‌న్ లో పాల్గొంటాన‌ని స్నేహితుడు మోహ‌న్ లాల్ కు ర‌జ‌నీ మాట ఇచ్చిన విష‌యం తెలిసిందే.. తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం ర‌జ‌నీ అమెరికి నుంచి ఈ నెల 20న వ‌చ్చి చిత్ర ప్ర‌మోష‌న్ ల‌లో పాల్గొంటార‌ని తమిళ చిత్ర పరిశ్రమలో వార్త‌లు షికారు చేస్తున్నాయి ర‌జ‌నీ కాంత్ ఇండియాకి రావ‌డం ఆయ‌న అభిమానుల‌కు సంతోషం క‌లిగించే విష‌య‌మే.

  అట్టకత్తి, మద్రాస్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన డైరక్టర్ రంజిత్ పా దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ స్దాయిలో ఉన్నాయంటే మాటల్లో చెప్పలేం. ఈ చిత్ర టీజర్, పాటలు ఇప్పటికే అంచనాలకు మించి ఆదరణ పొందడం, సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో రజనీ అభిమానుల్లో ఫెస్టివల్ మూడ్ క్రియేట్ అయ్యింది.

  ఎన్నడూ లేని విధంగా తొలిసారి అమెరికాలో 400 స్క్రీన్లలో పదర్శనకు సిద్ధమై రికార్డు సృష్టించబోతున్న కబాలి తెలుగు, హిందీ, మళయాల భాషల్లోనే కాక ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ దేశాల్లో ఆయా భాషల్లో డబ్ చేసి మరీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

  English summary
  Known for his deep involvement in meditation and yoga, Superstar Rajinikanth visited his guru Satchidananda's Lotus All Faiths temple in Virgina, U.S. He was accompanied by his daughter Aishwarya. "Appa n I his guru Satchidananda's "Lotus all faiths temple" 30th anniversary Yogaville Virginia a�� #BlessedSunday," she posted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X