»   » టైటిల్ దెబ్బకొట్టే హీరోకు అనారోగ్యం

టైటిల్ దెబ్బకొట్టే హీరోకు అనారోగ్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా వాళ్ళకు సెంటిమెంట్స్ ఎక్కువన్న సంగతి తెలిసిందే.టైటిల్ దగ్గరనుండి ఎన్ని అక్షరాలు ఉండాలో కనుక్కుని మరీ పెట్టి హిట్టు కొట్టడానకి ట్రై చేస్తూంటారు.తాజాగా రజనీకాంత్ హీరోగా ప్రారంభమై ఆగిపోయిన 'రాణా'చిత్రం టైటిల్ కి ఇప్పుడు టైటిల్ సెంటిమెంట్ పట్టుకుంది.ఆ టైటిల్ సరిగ్గా లేకపోవటమే రజనీకాంత్ కి అనారోగ్యానికి కారణమని కొందరు తేల్చటంతో ఇప్పుడా టైటిల్ ని మార్చే ఆలోచనలో ఉన్నారు.'రాణా'షూటింగ్ ప్రారంభమైన రోజే రజనీ అనారోగ్యంతో నగరంలోని ఆస్పత్రిలో చేరారు. ఆ తరవాత దాదాపు నెలన్నర పాటు సింగపూర్‌లో చికిత్స పొంది ఇటీవలే చెన్నై చేరుకున్నారు. వచ్చీ రాగానే దర్శకుడు రవికుమార్‌తో 'రాణా'టైటిల్ గురించి ఆయన చర్చించారని సమాచారం.దీపికా పదుకొణే హీరోయిన్ గా చేయనున్న ఈ చిత్రంలో ఆమె డేట్స్ దొరకటం ఇప్పుడు ఇబ్బందిగా మారటంతో మరికొంత కాలం ఈ చిత్రం ఆగే అవకాశం ఉంది.అక్టోబరు నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

English summary
KS Ravi Kumar is making arrangements to talk to a numerological expert regarding the title change. Rajini also given his nod to the director's wish for the change of the title as he is a stronger believer in astrology and numerology.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu