»   » హిమాలయాలకు రజనీ హఠాత్తు ప్రయాణం వెనుక రీజన్ ?

హిమాలయాలకు రజనీ హఠాత్తు ప్రయాణం వెనుక రీజన్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ ఎప్పటిలాగే మళ్ళీ హిమాలయాలకు ప్రయాణం కట్టారు.అయితే అది ఆధ్యాత్మక యాత్రా లేక రాజకీయాలనుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తా అనేది ఇప్పుడు తమిళ రాజకీయ,సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.వచ్చే నెల పదమూడవ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని భావించిన రజనీ హిమాలయాలకు వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే, ఆయన నటిస్తున్న 'రాణా' షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు ముందు విశ్రాంతి తీసుకోవాలని భావించినందునే ఆయన అక్కడికెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.అయితే అయితే తమిళనాడులో ఎండలు పెరగటంతో ఈ యాత్రను ప్లాన్ చేసినట్లు ఆయన వర్గీయులు చెప్తున్నారు.దాంతో ఎవరి వెర్షన్ వారిదన్నట్లు మారింది.

రానా విషయానికి వస్తే...అందులో సోనూసూద్ ని విలన్ గా బుక్ చేసారు.రజనీకాంత్ రీసెంట్ గా సోనూసూద్ అధ్బుతంగా నటించిన దబాంగ్, అరుంధతి చిత్రాలు చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమయ్యే చిత్రం కాబోతుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకోణి ని తీసుకున్నారు.అలాగే సంగీతం ఎప్పటిలాగే ఎ.ఆర్.రహమాన్ అందిస్తున్నారు. హైయిస్ట్ పెయిడ్ సాంకేతికనిపుణులు ఈ చిత్రానికి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని యూరోస్ ఇంటర్నేషనల్ వారు ఓచర్ స్టూడియోస్ తో కలిసి నిర్మించనున్నారు.ఈ చిత్రం ఓ పీరియడ్ డ్రామా గా చెప్తున్నారు.

English summary
After a gap of two years, superstar Rajinikanth has resumed his journey to his favourite destination, Himalayas. Along with a few close friends and family members the actor wants to left to the holy place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu