»   » చివరకు రజనీకాంత్ కీ ఆ పిచ్చి పట్టింది

చివరకు రజనీకాంత్ కీ ఆ పిచ్చి పట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఎక్కడ చూసినా సీక్వెల్స్ ఊసే వినపడుతోంది. ఈ నేపధ్యంలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కీ కూడా తన సినిమాల్లో ఏదో ఒకదాన్ని సీక్వెల్ చేసి అలరించాలనే ఆలోచన మొదలైంది. మొదటి చంద్రముఖి సీక్వెల్ చేద్దామనుకున్నా అనివార్య కారణాలతో ఆగిపోయారు. ఇప్పుడు ఆయన దృష్టి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన "భాషా" చిత్రంపై పడింది. దాంతో సంచలన విజయం సాధించిన ఆ చిత్రం సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానని మీడియాతో అన్నారు. దాంతో ఎవరా డైరక్టర్, భాషా తర్వాత ఏమౌతాడు వంటి ప్రశ్నలు అభిమానులలో మొదలయ్యాయి. ఇక అప్పట్లో "భాషా" చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. అయితే శివాజీ, రోబోలతో అందనంత ఎత్తుకు ఎదిగిన రజనీ...వరస ప్లాపుల్లో ఉన్న సురేష్ కృష్ణకు అవకాశమిస్తాడా అనే సందేహమూ అందరికీ వస్తోంది. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఏ నిర్ణయం తీసుకుంటాడు...నెక్ట్స్ ఏ చిత్రం చేయబోతాడు అన్న విషయం అందరికీ ఆసక్తి కరమే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu