»   »  నో పాలిటిక్స్ ప్లీజ్!!

నో పాలిటిక్స్ ప్లీజ్!!

Posted By:
Subscribe to Filmibeat Telugu


సూపర్ స్టార్ రజినీకాంత్ కు రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలేమీ లేవని అఖిల భారత రజినీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ స్పష్టం చేశాడు. రజినీకాంత్ 57వ జన్మదినోత్సవం రోజున సత్యనారాయణ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ ప్రకటన నిజంగా రజినీ ఫ్యాన్స్ కు నిరాశను కలిగించేదే కావచ్చు. అయినా చాలామంది ఫ్యాన్స్ సూపర్ స్టార్ కచ్చితంగా ఏదో ఒక రోజు రాజకీయాలలోకి వస్తాడనే నమ్మకాన్ని కలిగిఉన్నారు.

రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలి...ముఖ్యమంత్రి కావాలంటూ కోరుతూ కొద్దిరోజుల క్రితమే ఫ్యాన్స్ 120 మీటర్ల అతిపెద్ద బ్యానర్లను చెన్నై నగరమంతా ఏర్పాటు చేశారు. రజినీకాంత్ ఫ్యాన్స్ లో ఎక్కువగా ఒకప్పుడు యువకులుగా ఉన్నవారు ఇపుడు 40-50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. ఫ్యాన్స్ క్లబ్ అద్యక్షుడు సత్యనారాయణ ఇచ్చిన ప్రకటన వీరిని తీవ్రంగా నిరాశపరిచింది. వీరిలో చాలామంది రజినీ ఫ్యాన్స్ క్లబ్ ల వృద్ధికి కృషి చేసినవారే ఉన్నారు. ఎవరెంత కృషి చేసినా రాజకీయాలలోకి రావద్దనే అభిప్రాయం తనది కాదని ఇది మన సూపర్ స్టార్ అభిమతమేనని సత్యనారాయణ అంటున్నాడు. ఫ్యాన్స్ క్లబ్స్ సూపర్ స్టార్ పై ఈ విషయంలో వత్తిడి తెచ్చే పనులు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయ్ కాంత్ తో సూపర్ స్టార్ ను పోల్చవద్దని, విజయ్ కాంత్ ఫ్యాన్స్ క్లబ్ అంటే సూపర్ స్టార్ ఫ్యాన్ క్లబ్స్ అసూయ పడవద్దని ఆయన సూచించారు. విజయ్ కాంత్ ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చాడని ఆయన చెప్పుకొచ్చాడు.

రాజకియాలలోకి వస్తే మానసికంగా ఎంతో వత్తిడిని ఎదుర్కోవాల్సివస్తుందనే విషయాన్ని ప్యాన్ క్లబ్స్ మర్చిపోవద్దని, విజయ్ కాంత్ ఈ వత్తిడిని అనుభవిస్తున్నాడని ఆయన చెప్పాడు. ఈ విషయంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి మాట్లాడుతూ...అది ఆయన సొంత నిర్ణయం...దీని మీద కామెంట్ చేయను..రాష్ట్రం బాగుండాలని కోరుకునే మంచి వ్యక్తి రజినీకాంత్ రాజకీయాలలోకి రాకపోవడం వలన రాష్ట్రం మంచి మనసున్న వ్యక్తి పాలనను కోల్పోయింది...మున్ముందు ఆయన మనసు మార్చుకోవచ్చని ఆశిస్తున్నట్టు చో చెప్పారు.

బిజెపి సీనియర్ నాయకుడు తిరునావుక్కరసు మాట్లాడుతూ...రజినీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం..మరి కొన్ని సినిమాలలో నటించిన తరువాత ఆయన మనసు మార్చుకుంటే మంచిద..న్నాడు.

ఎమ్.డి.ఎమ్.కె జనరల్ సెక్రటరీ వైగో మాట్లాడుతూ...రజినీ నిర్ణయం విషయంలో స్పందించడానికేం లేదు..అది ఆయన సొంత నిర్ణయం...ఆయనేమనుకుంటే అది చేయవచ్చు...అన్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X