»   » రామ్ చరణ్ - రజనీకాంత్ ‘రోబో’ తాకిడికి తట్టుకోలేక సోలోగా ఎటాక్ చేయ్యొచ్చు..

రామ్ చరణ్ - రజనీకాంత్ ‘రోబో’ తాకిడికి తట్టుకోలేక సోలోగా ఎటాక్ చేయ్యొచ్చు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ నటించిన 'మగధీర" తెలుగు నాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రం తమిళ అనువాద హక్కులను కలైపులి థాను సొంతం చేసుకున్నారు. 'మగధీర"లో సునీల్ చేసిన పాత్రను అక్కడ వడివేలుతో రీషూట్ చేశారు. కాగా..తన సినిమాలకు మాత్రమే మాటలు రాసే భాగ్యరాజా ఈ చిత్రానికి మాటలు అందించారు. వాలి పాటలు రాశారు. తమిళంలో ఈ చిత్రానికి 'మన్నాది మన్నన్" అనే టైటిల్ ఖరారు చేశారు.

త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే 'రోబో" విడుదల కూడా త్వరలోనే ఉన్నందున 'మన్నాది మన్నన్" విడుదలను వాయిదా వేస్తే, ఆ తర్వాత పోటీ లేకుండా సోలోగా తమిళనాడుని ఎటాక్ చెయ్యొచ్చని అల్లు శిరీష్ అంటున్నాడు. రోబో, మన్నాది మన్నన్ ఒకేసారి రిలీజ్ అయితే రోబోనే చూస్తారు కానీ ఈ సినిమాని చూడరు కదా. అందుకే రజనీకాంత్ తో పోటీపడటం ఇష్టం లేక అల్లు శిరీష్ 'మన్నాది మన్నన్"ని వాయిదా వేస్తే మంచిదంటున్నాడేమో..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu