»   » రంభ చేసుకోబోయేది ఎల్టీటీఈ నేత కుమారుడా?

రంభ చేసుకోబోయేది ఎల్టీటీఈ నేత కుమారుడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో సినీ నటి రంభ వివాహం ఇంద్రన్ అనే పారిశ్రామిక వేత్తతో జరగనుందనే సంగతి తెలిసిందే. అయితే ఇంద్రన్ ఎల్టీటీఈ నేత కుమారుడంటూ తమిళ పరిశ్రమలో కలకలం మొదలయ్యింది. గత రెండు రోజులుగా ఇదే టాపిక్ కొనసాగుతోంది. దీనికి తోడు కొన్ని తమిళ సినీ పత్రికలు కూడా ఇంద్రన్ ఎల్టీటీఈ నేత కె.పద్మనాభన్ కుమారుడంటూ కథనాలు ప్రచురించాయి. అయితే ఇవన్నీ ఒట్టి వదంతులేనంటూ రంభ సోదరుడు శ్రీనివాస్ ఖండించారు.

ఆయన మీడియా తో మాట్లాడుతూ ఇంద్రన్ తండ్రి పేరు, ఎల్టీటీఈ నేత పేరు ఒకటే కావడంతో కొన్ని పత్రికలు ఇలాంటి రూమర్స్ రేపాయని వివరించారు. అలాగే ఇంద్రన్ తండ్రి పద్మనాభన్ పాతికేళ్ల క్రితమే మృతి చెందారన్నారు. ఇంద్రన్ కెనడాలో పెద్ద వ్యాపార సంస్థను నడుపుతున్నారన్నారు. ఇంద్రన్‌కు మూడు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయని వివరించారు.

అలాగే తమ బావ..ఎల్టీటీఈ నేత కుమారుడైతే బ్రిటన్ ప్రభుత్వం ఎలా వదిలేస్తుందని ప్రశ్నించారు. కావాలనే ఇలాంటి రూమర్స్ కి ఆద్యం పోస్తున్నారంటూ మండిపడ్డారు. రంభ, ఇంద్రన్‌ల నిశ్చితార్థం జనవరి 27న చెన్నైలో కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. వివాహాన్ని వచ్చే ఏప్రిల్‌లో తిరుమలలో చేయాలని ఇరు వైపుల పెద్దలూ నిర్ణయించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu