»   » రాజకీయాల్లో ఫ్లాప్.. మళ్లీ సినిమాల్లోకి

రాజకీయాల్లో ఫ్లాప్.. మళ్లీ సినిమాల్లోకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినిమాల్లోంచి,రాజకీయాల్లోకి, రాజకీయాల్లోంచి సినిమాల్లోకి జంప్ చేయటం సినిమా నటులకు అలవాటే. అక్కడ వర్కవుట్ కానప్పుడు తిరిగి తమ సినిమాల్లో ప్రవేశించి తన స్దానం నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. తాజాగా కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన అదే రూటులో ప్రయాణం పెట్టుకుంది. రాజకీయ ప్రస్దానానికి కొంతకాలం గ్యాప్ ఇచ్చి సినిమాల్లో బిజీ అవుదామనే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా తమిళ సినిమాలపై ఆమె తన దృష్టిని పెట్టింది.

శింబు నటించిన 'కుత్తు' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి దివ్య స్పందన(రమ్య). తొలి సినిమాతోనే హిట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుందీ అమ్మడు. గతంలో కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎంపీగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో సినిమాలకు కాస్త విరామం చెప్పి.. ప్రజాప్రతినిధిగా కొనసాగారు.

Ramya gets busy now

అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అమ్మడు పరాజయం పాలవడంతోపాటు.. రాజకీయాల్లో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. పలువురు నటులు కూడా రమ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టింది. బాగా అవకాశాలు ఉన్న తరుణంలో అన్నీ వదులుకుని వెళ్లిన దివ్య.. ఇప్పుడు అదేచోట తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అందుకోసం ప్రయత్నాలు మొదలెట్టింది. తనకు తెలిసిన దర్శకులు, నటులకు ఫోన్‌ చేసి మాటలు కలుపుతోందట ఈ ముద్దుగుమ్మ. ఈ మెరుపుతీగను త్వరలోనే తమిళతెరపై చూడొచ్చని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరో ప్రక్క కన్నడంలో ఆమె తిరిగి తన ప్రస్దానాన్ని కొనసాగించే ఆలోచనలో ఉంది.

English summary
The multilingual actress Ramya aka Divya Spandana is busy with a bunch of movies now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu