»   » రానా,ప్రభాస్ గెస్ట్ లుగా ఆ చిత్రంలో ?

రానా,ప్రభాస్ గెస్ట్ లుగా ఆ చిత్రంలో ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రభాస్, రానా ఇద్దరూ గెస్ట్ లుగా ఓ తమిళ చిత్రంలో కనిపించనున్నారా...అంటే అవుననే వినపడుతోంది. ఆ చిత్రం మరేదో కాదు...సూర్య నటిస్తున్న మాస్ చిత్రం. ఈ చిత్రంలో వీరిద్దరూ కొద్ది క్షణాలు సేపు అలా కనపడే కీలకమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఈ మేరకు షూటింగ్ కూడా జరిగిందని చెప్పుకుంటున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'మాస్‌' వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సౌత్ లో హారర్ కామెడీ, హారర్ యాక్షన్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దాంతో దర్శక,నిర్మాతలు,హీరోలు ఇలాంటి చిత్రాలకు ఓటు వేస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు ఓ చిత్రం రెడీ అవుతోంది. అందులో రామ్ చరణ్ సరనస ఎవడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్ ..దెయ్యంగా నటిస్తోందని సమాచారం. ఇప్పటి వరకు వినూత్నమైన చిత్రాలతో హీరో గా పేరుతెచ్చుకున్న తమిళ హీరో సూర్య తొలిసారి ఈ హారర్ చిత్రంలో నటిస్తున్నారు.

Rana and Prabhas to play cameo in Suriya’s Masss?

ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని మాస్ అనే పేరుతో తమిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ ఘోస్ట్ పాత్రలో కనిపించనుందని తమిళ చిత్ర వర్గాల సమాచారం. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య కూడా ఓ సన్నివేశంలో ఘోస్ట్ తరహా గెటప్‌లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు యాభైశాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.

సూర్య హీరోగా బిరియాని ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మాస్'. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి నార్మల్ రోల్ ఒకటి కాగా, రెండోది మాత్రం చనిపోయిన ఆత్మ. రీసెంట్ గా సినిమాలోని కొన్ని సన్నివేశాలు హైదరాబాద్ కోఠి‌లోని ఉమెన్స్ కాలేజ్, సుల్తాన్ బజార్లో చిత్రీకరణ జరిపారు.

అజిత్‌, విజయ్‌ల తర్వాత వేగంగా పేరు తెచ్చుకుంటున్న నటుడు సూర్య. వైవిధ్య నటనతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినీజనాలకు కూడా దగ్గరయ్యారు. ఎప్పటినుంచో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడా ప్రాజెక్టు మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

'మంగాత్తా', 'బిరియాని' విజయాలతో హవా చాటుకుంటున్న వెంకట్‌ప్రభు తాజాగా సూర్యతో మాస్‌మసాలా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'మాస్‌' అని పేరు కూడా పెట్టారు. స్టూడియో గ్రీన్‌ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. చిత్రంలో సూర్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయంటున్నారు. ఇందులో సూర్యకు జంటగా నయనతార, ఎమీజాక్సన్‌ నటిస్తున్నారు. ఎప్పటిలాగే వెంకట్‌ప్రభు తమ్ముడు ప్రేమ్‌జీ ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

English summary
Rana and Prabhas are likely to play cameo in Suriya’s Masss. Venkat Prabhu is being directed this film and produced by Studio Green. Nayantara is also one of the lead female lead in this film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu