Don't Miss!
- News
వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి గుడ్ బై ? ఇన్ ఛార్జ్ రెడీ చేసుకుంటున్న జగన్ !
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
రంగస్థలం రీమేక్ పై బెంగపెట్టుకున్న మెగా ఫ్యాన్స్, క్యాస్టింగే పైనే బోలెడు డౌట్లు
ఉత్తరాదిన నెపోటిజంపై జనాలు ఉద్యమిస్తున్నా, దక్షిణాదిన మాత్రం వారసులకే పెద్ద పీట వేసే సంప్రదాయానికి జనాలు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. వారికే కాదు, వారి సినిమాలకు కళంకం వచ్చినా సహించలేనంత అభిమానం ఇక్కడి ఫ్యాన్స్ నరనరాన్నా జీర్ణించుకుపోయింది అనడానికి తాజా ఘటనే ఉదాహరణగా నిలిచింది.
ఇంతకూ విషయం ఏమిటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే దానిపై రిజల్ట్ పై ఆశలు వదిలేసుకున్నారు మెగా ఫ్యాన్. ఎందుకంటే, క్యాస్టింగేనట.

రీమేక్ లో చెర్రీ పాత్రలో ప్రముఖ కొరియోగ్రాఫర్, కమ్ హీరో, కమ్ డైరెక్టర్, కమ్ ప్రొడ్యూసర్ అయిన రాఘవ లారెన్స్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అక్కడి వరకూ బాగానే ఉన్నా.. హీరోయిన్ పాత్రకు పాత చింతకాయ పచ్చడి లాంటి ఫేడ్ అవుట్ హీరోయిన్ నిక్కీ గర్లానీని ఎంపిక చేయడమే మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సమంత పోషించిన పాత్రకు నిక్కీని ఎంపిక చేయడం పై సర్వత్ర చర్చ నడుస్తోంది.
అయితే, రంగస్థలం మూవీని ఇలా ఎవరితో పడితే వారితో రీమేక్ చేసే బదలు దాన్ని యథాతథంగా డబ్బింగ్ చేసి దేశవ్యాప్తంగా విడుదల చేస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల చెర్రీ ఇమేజ్ కూడా బిల్డప్ అవుతుందన్నది వారి ఆశ. ఏమైనా ఎవరి ఆలోచనలు వారివి. మరి లారెన్స్ చిట్టిబాబు పాత్రకు ఏమేరకు న్యాయం చేస్తాడో చూడాలి.