»   » రోమాన్స్ చేయడం ఇష్టం లేకనే రాణాలో సోనాక్షి సిన్హాను వద్దన్న రజనీకాంత్

రోమాన్స్ చేయడం ఇష్టం లేకనే రాణాలో సోనాక్షి సిన్హాను వద్దన్న రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా చిత్రంలో రజనీకాంత్ సరసన దీపికా పడుకొనే స్థానంలో తొలుత సోనాక్షి సిన్హా పేరును పరిశీలించారు. దబాంగ్ గర్ల్ సోనాక్షికి మొదట ఆ ఆవకాశం వచ్చిందట. కమల్ హాసన్ సినిమా విశ్వరూపం సినిమా ద్వారా సోనాక్షి సిన్హా అప్పటికే కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆమె తన నిర్ణయం చెప్పేలోగానే దీపికా పడుకొనే పేరును ఖరారు చేశారు. రజనీకాంత్ ఇష్టపడకపోవడం వల్లనే సోనాక్షి సిన్హాను తప్పించినట్లు చెబుతున్నారు.

తన మిత్రుడు శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హాతో రోమాన్స్ చేయడం రజనీకాంత్‌కు ఇష్టం లేదని చెబుతున్నారు. దీనివల్లనే సోనాక్షి ఆ చాన్స్ కోల్పోయిందని చెబుతున్నారు. చాలా కాలంగా రజనీకాంత్, శతృఘ్న సిన్హాలకు మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరు సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఏమైనా, సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని సోనాక్షి సిన్హా కోల్పోయింది.

English summary
Sonkashi who is going to make her debut in Kollywood with Vishwaroopam opposite Kamal Hassan was the first choice for Rana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu