»   » జీవితాంతం నిత్యానంద భక్తురాలిగానే ఉంటా

జీవితాంతం నిత్యానంద భక్తురాలిగానే ఉంటా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాను జీవితాంతం నిత్యానందకు భక్తురాలిగానే ఉంటానని నటి రంజిత అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. నిత్యానంద, రంజిత రాసలీలల్లో మునిగి తేలుతున్న సీడీలు గత ఏడాది బయటపడిన విషయం విదితమే. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో నిత్యానందకు రంజిత దూరంగా ఉంటారని అందరూ భావించారు. అయితే నూతన సంవత్సరం రోజున ఆమె బెంగళూరు ఆశ్రమం లో నిత్యానందకు పాదపూజ చేస్తూ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. రంజిత ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆ సీడీల్లో ఉన్నది నిజం కాదన్నారు.

లేనివి ఉన్నట్లు సృష్టించి సీడీల రూపంలో బయటపెట్టిన లెనిన్ కరుప్పన్ సిగ్గుతో తలదించుకోవాలే తప్ప తాను కాదన్నారు. తనపై మచ్చ పడడం వేదన కలిగించిందని, అందుకే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిం దని తెలిపారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. ఎవరు నమ్మినా, నమ్మకు న్నా తన కుటుంబ సభ్యులు తనపై నమ్మకాన్ని ఉంచడం ధైర్యం కలిగించిందన్నారు. అందుకే బయటకు వచ్చి ఆ మచ్చను చట్టపరంగా పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సినిమాల్లో నటించే విషయమై ఇంకా ఆలోచించలేదని, కథ నచ్చితే తప్పకుండా చేస్తానని అన్నారు. అది కూడా మచ్చను పోగొట్టుకున్న తర్వాతేనన్నారు.

అలాగే స్వామి ఏనాడూ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదంది. స్వామి త్వరలోనే స్వయంగా వాస్తవాలు వెల్లడిస్తారని వివరించింది. ఇక తను ఆయన్ని ఆశ్రయించటానికి కారణం చెపుతూ..చిన్నతనం నుంచీ తనను పీడిస్తున్న శ్వాసకోశ వ్యాధిని ఒక్కరోజులో తగ్గించినందువల్లే ఆయనకు పరమ భక్తురాలిగా మారానన్నారు. తనపై మీడియాలో దు ష్ప్రచారం సాగుతున్నదని, ఇది న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu