»   » రవితేజ 'కిక్' తమిళ రీమేక్ రిజల్ట్ ఏమిటి?

రవితేజ 'కిక్' తమిళ రీమేక్ రిజల్ట్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో సూపర్ హిట్టయిన 'కిక్' చిత్రం తమిళంలో తిల్లాంగణి టైటిల్ తో రీమేక్ అయి రిలీజైన సంగతి తెలిసిందే. జయం రవి, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అక్కడ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగు చిత్రాన్ని డ్రస్ లతో సహా మక్కీకి మక్కీ కాపీ కొట్టినట్లున్న ఈ చిత్రం అక్కడ ప్రేక్షకులను అలరించలేకబోతోంది. ఒరిజనల్ వెర్షన్ లోని ఇలియానాలా..తమన్నా, రవితేజలా జయం రవి పూర్తి స్ధాయిలో అనుసరిస్తూ నటించారని రివ్యూలు వచ్చాయి. అలాగే కథే మైనస్ అయి నసగా మారిందని వాళ్ళు రాసుకొచ్చారు. తెలుగులో బ్రహ్మానందం చేసిన హల్వారాజ్ పాత్రని వడివేలు బాగా పండించాడని ఉన్నంతంలో అదే కాస్త రిలీఫ్ అంటున్నారు. ఇక తెలుగులో శ్యామ్ చేసిన పాత్రను తమిళంలోనూ పోషించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu