»   »  తమిళంలోకి రవితేజ ప్లాఫ్ సినిమా

తమిళంలోకి రవితేజ ప్లాఫ్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తెలుగులో ప్లాపైన 'సారొచ్చారు' చిత్రం తమిళంలోకి డబ్బింగ్ అవుతోంది. కాజల్‌, రిచా గంగోపాధ్యాయతో రవితేజ ఆడిపాడిన చిత్రం 'సారొచ్చారు'. తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళులనూ ఆకట్టుకోవడానికి అనువాదమవుతోంది. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దేవీశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు అన్నివర్గాలనూ ఆకట్టుకున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ..... '' తమిళంలో 'సార్‌ వందారా' పేరుతో అనువాదం చేస్తున్నాం. ప్రేమ గొప్పదా.. పెళ్లి గొప్పదా.. అనే విషయానికి ప్రాధాన్యతిస్తూ తెరకెక్కించాం. రొమాన్స్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌ సన్నివేశాలకు కొదవుండదు. గతంలో రవితేజ చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాము''అని చెప్పాయి.


బలుపు హిట్ తో ఊపు మీద ఉన్న రవితేజ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. బలపు రచయిత...బాబి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వైవియస్ చౌదరి ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు వైవియస్ చౌదరి ఆఫీసులో నిన్న(ఆదివారం)జరిగాయి. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా చిత్రం రూపొందనుందని సమాచారకం. ఈ నెలాఖరనుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది.


బాబి గతంలో ... డాన్ శ్రీను, బాడీ గార్డ్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు. వరుస ప్లాపులతో సతమతం అయిన రవితేజకు 'బలుపు' చిత్రం హిట్‌తో కాస్త ఊరట లభించింది. ఇంత కాలం స్క్రిప్టుపై పెద్దగా దృష్టి పెట్టని రవితేజ... బలుపు చిత్రం దగ్గర నుంచి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. గుడ్డిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటే పోతే తన కెరీర్‌కు ఆపద తప్పదని గ్రహించాడు. అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.

English summary
Ravi Mass Maharaja Ravi Teja, who is basking in the success of his latest movie Balupu, is now turning Saar Vandaara. Yes! His previous film Saar Vasthara, which has done flop at the Andhra Pradesh Box Office, is now being dubbed in Tamil as Saar Vandaara and released in Tamil Nadu soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu