»   » గోపీచంద్ డైరక్టర్...'విక్రమార్కుడు' రీమేక్

గోపీచంద్ డైరక్టర్...'విక్రమార్కుడు' రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ హీరో గోపీచంద్ తో శౌర్యం, శంఖం చిత్రాలు రూపొందించిన దర్శకుడు శివ తాజాగా విక్రమార్కుడు చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నాడు. రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. దాంతో శివ తనదైన శైలిలో మ్యానరిజమ్స్ మార్చుకుని మరింత మాస్ మసాలా సినిమాగా తమిళంలోకి మార్చేందుకు రెడీ అవుతున్నారు. తమిళంలో హీరో సూర్య తమ్ముడు కార్తి హీరోగా చేయనున్నారు. కార్తి హీరోగా చేసిన యుగానికొక్కడు చిత్రం క్రిందటి వారమే రిలిజైంది. ఇక స్టూడియో గ్రీన్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు..ఒకరు దొంగ గానూ, మరొకరు పోలీసాఫీసర్ గాను. ఈ రెండు పాత్రల్లో కార్తి ఒదిగిపోతాడనే తమిళ వర్గాలు భావిస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu