'గజిని-2' కి రంగం సిద్దం..డిటేల్స్
సూర్య కెరీర్‌లో నేటికీ అతిపెద్ద విజయంగా నిలిచిందీ చిత్రం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. తమిళంలోనే కాకుండా దక్షిణాదిలో కూడా సంచలన విజయం సాధించింది. అతి త్వరలోనే ఈ సినిమాకు రెండో భాగం తెరకెక్కనుందని చెబుతున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక 'గజిని-2' కూడా ఏఆర్.మురగదాస్- సూర్య కాంబినేషన్‌లోనే తెరకెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నై ఫిలింఛాంబర్‌లో ఇప్పటికే టైటిల్‌ను కూడా నమోదు చేయించడం గమనార్హం. ఇక అధికారిక ప్రకటనే తరువాయి. ఈ మేరకు మురగదాస్ స్క్రిప్టు వర్క్ పూర్తి చేసినట్లు చెప్తున్నారు.
మరో ప్రక్క సూర్య-అనుష్క జంటగా నటించిన 'సింగం' (తెలుగులో యముడు) సినిమాకి సీక్వెల్ విడుదలకు సిద్దమవుతోంది. 'ఓంగి అడిచ్చా... ఒండ్ర టన్ వెయిట్‌డా..' అంటూ జనంలోనూ ఆవేశాన్ని తెప్పించిన సూర్య ఇప్పుడు 'సింగం-2'గా అలరించనున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తయినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. వచ్చేనెల ఆడియో విడుదల ఉండొచ్చని కోడంబాక్కం సమాచారం. తెలుగులో 'యముడు-2'గా పేరు పెట్టారు. ఇటీవలే హైదరాబాద్‌లో కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాష్ట్రంలోని తూత్తుకుడి, నెల్త్లె, కారైక్కుడి, చెన్నైలో అధికభాగం తెరకెక్కించారు. అంజలి నటించిన పాట కోసం అధికమొత్తం వెచ్చించారు. ఆమెకు రూ.20 లక్షల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications












