»   » ఎంజాయ్ చేసి, వదిలించుకుందామనుకున్న నిర్మాత, ఫొటోలు లీక్ చేసి ఇరికించిన హీరోయిన్

ఎంజాయ్ చేసి, వదిలించుకుందామనుకున్న నిర్మాత, ఫొటోలు లీక్ చేసి ఇరికించిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై: కొన్ని పైకి అతి సాధారణ విషయాలుగా ఉన్నా, లోపలకి వెళ్లి తొంగి చూస్తే షాకింగ్ వాస్తవాలు బయిటపడుతూంటాయి. ఎవరో నా మొబైల్ ని హ్యాక్ చేసారు. నా పర్శనల్ ఫొటోలు లీక్ చేసారంటూ మొత్తుకుంటూ సైబర్ క్రైమ్ కేసు పెడతానంటున్న ఓ స్టార్ హీరోయిన్ అసలు ఆలోచన వేరే అని తమిళ సినీ సర్కిల్స్ లో వినపడుతోంది.

వివరాల్లోకి వెళితే... ఓ స్టార్ హీరోయిన్ ... గత కొద్ది రోజులుగా ఓ పెద్ద ఇండస్ట్రలియస్ట్ తో సన్నిహితంగా ఉంటోంది. అతను సినీ ప్రపంచంతో సన్నిహిత సంభందాలు ఉన్నవాడేట. అయితే అందులో వింతేమీ లేదు. కానీ ఆ ఇండస్ట్రిలియస్ట్ ఓ ప్లే బోయ్ టైప్ కాండెట్ అని ఆమె గుర్తించిదట. గతంలోనూ కొంతమంది స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ నడిపి మెల్లిగా ప్రక్కకు తప్పుకున్నాడుట.

Reason behind...actress leaked photos with industrialist?

ఈ విషయం ఆమె స్నేహితులు కొందరు ఆమెకు హెచ్చరించారట. ఆ విషయం మొల్లిమెల్లిగా ఆమెకూ అవగతమైందిట. ముఖ్యంగా తనపై మోజు తీరి, వదిలించుకునే రోజు అతి కొద్ది దగ్గరల్లోనే ఉందని అతని బిహేవియర్ ని బట్టి ఆమె గుర్తించిందట. దాంతో ఇలా కాదు వీడిని ఇరికించి, పెళ్లి దాకా తీసుకెళ్లాలి, బుద్ది చెప్పాలి అనుకుందిట. అందులో భాగంగా అతనితో క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు కావాలనే లీక్ చేసిందిట.

తను అనుకున్నట్లుగానే ఆ ఫొటోలు మీడియాలో హల్ చల్ చేస్తూండటంతో, తెలివిగా తన సెల్ ని ఎవరో హ్యాక్ చేసి, ఇలా వదిలారని కథ అల్లిందిట. సైబర్ సెల్ కు రిపోర్ట్ చేస్తాను అని హడావిడి చేసింది కానీ ఇప్పటిదాకా ఆ పని చేయలేదట. అయితే ఇలా తెలివిగా ఆ ఇండస్ట్రిలియస్ట్ ని ఇరికించటం అంతకు ముందు దెబ్బ తిన్న మిగతా హీరోయిన్స్ కు ఆనందం కలిగించి, పండగ చేసుకున్నారట. వాళ్లంతా ఆమెకు ఫోన్ చేసి తన సంతోషం పంచుకోవటమే కాక, పార్టీ చేసుకుందాం అని పిలుస్తున్నారట. అదీ సంగతి. మరి ఆ ఇండస్ట్రలియస్ట్ రెస్పాన్స్ ఏంటో మరి.

English summary
Here is the secret behind the photos released by Bird actress with industrialist producer. She said that suffered a setback as her phone was recently hacked, and her private photos and information leaked online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu