»   » సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఈ లేడీస్ వీక్ నెస్ ఏంటో...

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఈ లేడీస్ వీక్ నెస్ ఏంటో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'రోబో" తర్వాత రజనీకాంత్ ఎలాంటి సినిమా చేస్తాడనే విషయంపై నెలకొన్న సందేహాలని తొలగిస్తూ 'రాణా"చిత్రాన్ని చేస్తున్నట్టు రజనీ ప్రకటించాడు. శంకర్ తో వరుసగా రెండు సినిమాలు చేసి, ఇప్పట్లో దక్షిణాదిలో మరే సినిమా అందుకోలేని రికార్డుని 'రోబో"తో నెలకొల్పిన తర్వాత అంతకంటే గొప్ప విలువలున్న చిత్రం చేస్తాడని అభిమానులు ఊహించారు. కానీ కెఎస్ రవికుమార్ లాంటి మసాలా డైరెక్టర్ తో మిలి చిత్రాన్ని ప్రకటించి రజనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కి పోటీగా నిలిచే పాత్రలో బాలీవుడ్ నటి రేఖ నటించనుందని అంటున్నారు. 'నరసింహా" నీలాంబరి తరహా పాత్రలో ఇందులో విలన్ గా నటిస్తుందని చెబుతున్నారు. అయితే రజనీకాంత్ ఇమేజ్ ఇప్పుడు లేడీ విలన్స్ కి సవాళ్లు విసిరే లెవల్ దాటిపోయిందని, ఇక ఆయన ఈ లేడీస్ వీక్ నెస్ ని పక్కన పెట్టి స్ట్రాంగ్ విలన్ ని పెట్టుకుంటే బాగుంటుందని కోలీవుడ్ విశ్లేషకులు గొణుగుతున్నారు. రజనీకి విలన్ రజనీనే తప్ప మరొకరు ఉండలేరని 'రోబో" సినిమాతో శంకర్ చాటిచెప్పాక కూడా రజనీ ఆడ విలన్ తో సై అనడం విచిత్రంగానే ఉంది కదూ..

English summary
Superstar Rajinikanth’s next project Rana is eagerly awaited by his fans worldwide. Rana, a trilingual to be made in Hindi, Tamil and Telugu, has Rajini playing a triple role. While Deepika Padukone and Sonu Sood have already been finalized for Rana, the buzz is that veteran actress Rekha too would be featuring in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu