»   » చేతిలో సూపర్ స్టారే ఉంటే ఆయన బొమ్మెందుకు!

చేతిలో సూపర్ స్టారే ఉంటే ఆయన బొమ్మెందుకు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చేతిలో సూపర్ స్టారే ఉంటే ఆయన బొమ్మెందుకనీ అన్నట్టు..రజనీకాంత్ కూతురు సౌందర్య చేపట్టిన యానిమేషన్ ప్రయోగం వికటించింది. రజనీకాంత్ తో 'సుల్తాన్..ది వారియర్" అనే పేరుతో వివిధ భాషల్లో యానిమేషన్ సినిమా తలపెట్టిన సౌదర్య రజనీకాంత్ దాని మీద ఇప్పటికే కోటానుకోట్లు ధారబోసింది. అయితే ఇంతదాకా ఆ సినిమా వెలుగు చూడనేలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఈ చిత్రంతో మొదట్లో రిలయన్స్ సంస్థ అసోసియేట్ అయింది. అయితే సినిమా మరీ జీళ్ల పాకంలా సాగుతోంటే డబ్బులు తిరిగిచ్చేయమని హుకుం జారీ చేసి నిర్మాణం నుంచి అది తప్పుకుంది. అయితే ఇంతదాకా బాకీ తీర్చని సౌందర్య వచ్చే జూన్ లో 'సుల్తాన్" ని రిలీజ్ చేయడానికి సిద్దమవుతోంది. ఇది తెలుసుకున్న రిలయన్స్ వారు సౌందర్య మీద కేసు వేశారు తమకు రావాల్సిన పదకొండు కోట్ల అరవై లక్షల రూపాయలకి ఏడాదికి పన్నెండు శాతం వడ్డీ జోడించి మరీ ఇవ్వాలని, లేదంటే సినిమా విడుదల చేయనివ్వరాదని కోర్టుకెక్కారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu