»   » రెమో సెన్సార్ పూర్తి, అక్టోబర్ 7న విడుదల

రెమో సెన్సార్ పూర్తి, అక్టోబర్ 7న విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 19న విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. కేవలం ఒక్కరోజులోనే ఈ ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండటంపై వల్లనే ఇన్ని వ్యూస్ వచ్చాయని అంటున్నారు.

Remo Censored with clean 'U' certificate

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న ఆడియో రిలీజ్ చేసారు. ఆడియో రిలీజ్ ముందు వరకు అంతంత మాత్రంగానే ఉన్న రెస్పాన్స్... అనిరుధ్ అందించిన సంగీతంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో ఆల్బంలో మొత్తం 7 పాటలున్నాయి

ఒక్కరోజులోనే రెమో ట్రైలర్ఈ రేంజిలో వ్యూస్ సొంతం చేసుకోవడంతో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో నెం.1 స్థానం దక్కించుకుంది.

English summary
Remo Censored with clean 'U' certificate and releasing worldwide on October 7, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X