»   » హాలీవుడ్ రేంజిలో ఉంది గురూ.. (రెమో- సిరిక్కాదే వీడియో)

హాలీవుడ్ రేంజిలో ఉంది గురూ.. (రెమో- సిరిక్కాదే వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఒక సినిమా ఎంత మంచి కంటెంటుతో ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులకు త్వరగా రీచ్ కావాలంటే విడుదల ముందు నుండే ప్రచార కార్యక్రమాలు(ప్రమోషన్స్) తప్పనిసరి. ఈ విషయంలో బాలీవుడ్ వారు అందరికంటే ముందున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సౌత్ సినిమా పరిశ్రమలో కూడా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల కాన్సెప్టులతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే ప్రత్యేకంగా మ్యూజిక్ వీడియోలు రూపొందిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న తమిళ మూవీ రెమో చిత్రం కోసం కూడా ఓ ప్రమోషనల్ వీడియో సిద్దమైంది. 'సిరిక్కాదే' పేరుతో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోను గురువారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు. వీడియో కాన్సెప్టు, టేకింగ్, ఫోటోగ్రఫీ, ఆర్ట్స్ డైరెక్టర్ వర్క్ హాలీవుడ్ స్థాయిలో ఉందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

సోనీ మ్యూజిక్ ఇండియా వారి యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్ పేజీ ద్వారా ఈ సాంగును రిలీజ్ చేసారు. ఈ ప్రమోషనల్ సాంగు కాన్సెప్టుకు ప్రభురాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. యూత్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. విగ్నేష్ శివన్ లిరిక్స్ అందించగా, అర్జున్ కనుంగో, శ్రీనిధి వెంకటేష్ వోకల్స్ అందించారు. ఈ సాంగుకు స్వరూప్ ఫిలిప్ డైరెక్టర్ ఆప్ ఫోటోగ్రఫీగా పని చేసారు.

ఈ ప్రమోషనల్ మ్యూజిక్ వీడియోలో శివకార్తికేయన్, కార్తి సురేష్, అనిరుధ్, అర్జున్ కనుంగో, శ్రీనిధి వెంకటేష్, ఇన్నో గెంగా, మరియా, శశాంక్ విజయ్, కేబ జర్మయ్య తదితరులు నటించారు. ఈ మ్యూజిక్ వీడియో ఇంగ్లీష్ వెర్షన్ కూడా త్వరలో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

English summary
Remo - Sirikkadhey Music Video released today. Watch the incredibly classy Promotional Song video of Sirikkadhey from Remo directed by Prabhu Radhakrishnan, in the music of Anirudh Ravichander. Arjun Kanungo of Bollywood Pop fame & Srinidhi Venkatesh of Avalukena fame are making their respective debuts with this mesmerising love track penned by Vignesh Shivn.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu