»   » రెమో-సిరిక్కాదే: దుమ్మురేపబోతున్న ప్రమోషనల్ సాంగ్

రెమో-సిరిక్కాదే: దుమ్మురేపబోతున్న ప్రమోషనల్ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఒక సినిమా ఎంత మంచి కంటెంటుతో ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులకు త్వరగా రీచ్ కావాలంటే విడుదల ముందు నుండే ప్రచార కార్యక్రమాలు(ప్రమోషన్స్) తప్పనిసరి. ఈ విషయంలో బాలీవుడ్ వారు అందరికంటే ముందున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సౌత్ సినిమా పరిశ్రమలో కూడా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల కాన్సెప్టులతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే ప్రత్యేకంగా మ్యూజిక్ వీడియోలు రూపొందిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న తమిళ మూవీ రెమో చిత్రం కోసం కూడా ఓ ప్రమోషనల్ వీడియో సిద్దమైంది. 'సిరిక్కాదే' పేరుతో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోను ఆగస్టు 18న రిలీజ్ చేయబోతున్నారు.

సోనీ మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్ పేజీ ద్వారా ఈ సాంగును రిలీజ్ చేస్తారు. ఈ ప్రమోషనల్ సాంగు కాన్సెప్టుకు ప్రభురాధాకృష్ణన్ దర్శకత్వం వహంచారు. యూత్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. విగ్నేష్ శివన్ లిరిక్స్ అందించగా, అర్జున్ కనుంగో, శ్రీనిధి వెంకటేష్ వోకల్స్ అందించారు. ఈ సాంగుకు స్వరూప్ ఫిలిప్ డైరెక్టర్ ఆప్ ఫోటోగ్రఫీగా పని చేసారు.

ఈ ప్రమోషనల్ మ్యూజిక్ వీడియోలో శివకార్తికేయన్, కార్తి సురేష్, అనిరుధ్, అర్జున్ కనుంగో, శ్రీనిధి వెంకటేష్, ఇన్నో గెంగా, మరియా, శశాంక్ విజయ్, కేబ జర్మయ్య తదితరులు నటించారు. ఈ మ్యూజిక్ వీడియో ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. తమిళ వెర్షన్ విడుదలైన వారం తర్వాత ఎంటీవీ ద్వారా ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ చేస్తారు.

సిరిక్కాదే

సిరిక్కాదే

‘సిరిక్కాదే' పేరుతో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోను ఆగస్టు 18న రిలీజ్ చేయబోతున్నారు

సోనీ మ్యూజిక్

సోనీ మ్యూజిక్

సోనీ మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్ పేజీ ద్వారా ఈ సాంగును రిలీజ్ చేస్తారు.

డైరెక్షన్, మ్యూజిక్

డైరెక్షన్, మ్యూజిక్

ఈ ప్రమోషనల్ సాంగు కాన్సెప్టుకు ప్రభురాధాకృష్ణన్ దర్శకత్వం వహంచారు. యూత్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు.

ఫీచరింగ్

ఫీచరింగ్

ఈ ప్రమోషనల్ మ్యూజిక్ వీడియోలో శివకార్తికేయన్, కార్తి సురేష్, అనిరుధ్, అర్జున్ కనుంగో, శ్రీనిధి వెంకటేష్, ఇన్నో గెంగా, మరియా, శశాంక్ విజయ్, కేబ జర్మయ్య తదితరులు నటించారు.

ఇంగ్లీషులో కూడా

ఇంగ్లీషులో కూడా

ఈ మ్యూజిక్ వీడియో ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

అంచనాలు పెంచేందుకే

అంచనాలు పెంచేందుకే

సినిమాపై అంచనాలు పెంచేందుకే ఈ ప్రమోషనల్ వీడియోను డిజైన్ చేసారు.

English summary
Sirikkadhey is a promotional Music Video for The movie Remo. This amazing song is all set for its release on the 18th of August at 6.00 pm. It will be aired through Sony Music's official YT channeland Twitter page.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu