twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ కమిడియెన్ భార్యకు నోటీసులు

    By Srikanya
    |

    Vadivelu
    చెన్నై: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నట్టు హాస్య నటుడు వడివేలు భార్యకు రెవిన్యూ శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్‌ యూనియన్‌, మణిమంగలం గ్రామపంచాయితీ పరిధిలోని పుష్పగిరి ప్రాంతంలో ప్రభుత్వానికి సొంమైన 200 ఎకరాలకు పైబడిన స్థలం ఉంది. ఈ స్థలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతులు వ్యవసాయం చేస్తూవచ్చారు.

    కాలక్రమేణ వారి నుంచి పలువురు నటీనటులు ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఫామ్‌ హౌస్‌ నిర్మించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సదరు స్థలాన్ని ఆక్రమించుకున్న 19 మందికి రెవిన్యూశాఖాధికారులు నోటీసులు పంపారు. ఈ జాబితాలో నటుడు వడివేలు భార్య విశాలాక్షి పేరు కూడా ఉంది.

    రోజుకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకూ వసూలు చేసిన స్టార్ కమిడియన్ వడివేలు.ఆయన గత కొంతకాలంగా చేతిలో ఒక్క సినిమా కూడా లేక పూర్తి ఖాళిగా ఉన్నాడు. దానికి కారణం రజనీకాంత్ తో వడివేలు తగువు పెట్టుకోవటమే. అప్పట్లో రజనీ నటించాల్సిన 'రాణా' చిత్రం నుంచి వడివేలును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ అన్నాడీఎంకే గుర్తుపై ఓటేసినట్లు మీడియాలో పొక్కడంతో అసహనానికి గురైన వడివేలు.. 'రజనీ గిజనీ జాన్తానై.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినరోజు వీరందరి సంగతి తేలుస్తా' అని ప్రకటించారు. ఇది కూడా పరిశ్రమలోని రజనీ మద్దతుదారుల కోపానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వడివేలుకు ఒక్క సినిమా కూడా లేకపోయింది. అయితే 'ప్రస్తుతం జరుగుతున్నదానికి వడివేలు ఏమీ పశ్చాత్తాప పడట్లేదు. తన కోపాన్ని, తన మనసులోని మాటను బయటపెట్టగలిగానని సంతృప్తి పడుతున్నారు' అని వడివేలు గురించి సన్నిహితులు చెప్తున్నారు.

    గతంలోనూ మరో స్టార్ హీరో విజయ్ కాంత్ తో తగువు పెట్టుకున్నాడు. ఆ గొడవ వడివేలు నివాస స్దలం వద్ద మొదలైంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్‌ను ఓడిస్తానని బహిరంగ శపథం చేశారు. విజయ్‌కాంత్ అన్నాడీఎంకేతో కలిసి పోటీచేయడంతో.. వడివేలు డీఎంకేకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రమంతా తిరుగుతూ 20 రోజుల పాటు చేసిన ప్రచారంలో హద్దుమీరి విమర్శలు చేశారు. విజయకాంత్‌ని పలుమార్లు 'ఒరేయ్' అంటూ సంబోధించడంతో పాటు ఆయన సతీమణిపై కూడా మాటల తూటాలు పేల్చి విమర్శలకు గురయ్యారు.

    English summary
    Tamilnadu revenue department sent notice to actor Vadivelu wife on encroachment allegation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X