»   » సెన్సార్ చిక్కుల్లో రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర'

సెన్సార్ చిక్కుల్లో రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర'

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా రక్త చరిత్ర తమిళ వెర్షన్ రక్త చరితం చెన్నైలో సెన్సార్ కి హాజరయ్యారు. సూర్య ప్రధానపాత్రలో చేస్తున్న ఈ చిత్రంపై సెన్సార్ వారు పలు అభ్యంతరాలు తెలిపారు. ఈ విషయమై వర్మ మీడియాతో మాట్లాడుతూ..రీజనల్ సెన్సార్ బోర్డు చెన్నై వారు ఈ చిత్రాన్ని చూసి కొన్ని కట్స్ చెప్పారు. నేను వాటిని ఒప్పుకోలేదు. రివైజింగ్ కమిటీకి వెళ్తున్నాం. వారు ఈ చిత్రాన్ని చూసి రికమెండ్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు. ఇక చిత్రంలో సెన్సార్ కట్స్ ఎక్కడ వచ్చాయన్నదానికి సమాధానం చెప్తూ...వారు ఫలానా సీన్ కట్ చేయమని చెప్పటం లేదు. అక్కడక్కడా కొన్ని విజువల్ షాట్స్ ని తొలిగించమంటున్నారు. అవి చిత్ర కథకి చాలా అత్యవసరమైనవి అని నేను భావిస్తున్నాను అన్నారు. అలాగే ...ఈ చిత్రం హింసాత్మక చిత్రమా అన్నదానికి సమాదానమిస్తూ.. పగకి, ప్రతాకారనికి, కోపానికి చెందిన కథ చెప్తున్నప్పుడు తప్పనిసరిగా కొంత హింసని ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పటికీ సజెష్టివ్ గా సౌండ్ ఎఫెక్ట్స్,లైటింగ్ ద్వారానే హింసను ప్రెజెంట్ చేసాం అన్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ మూడవ తేదిన విడుదల కానుంది. తమిళనాడులో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది.

ఇక ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ..."రక్త చరిత్ర" చిత్రంలో ఓ సన్నివేశం చేసిన తర్వాత ఓ పూట వరకూ మామూలు మనిషిని కాలేకపోయానంటూ హీరో సూర్య తన అనుభూతులను వివరించారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ఆ సన్నివేశంలో నేను జైలులో ఉంటాను. నా జైల్ మేట్స్ తో నా జరిగిన గతం గురించి చెబుతూంటాను...ఆ డైలాగ్...రెండు ముక్కలైన నా తల్లిని చూసాను. నా చెల్లెలు పూర్తిగా కాలిపోయి జీవఛ్చవంలా మారిపోయింది. కేవలం ఆమె మెడలో నక్లెస్ చూసే గుర్తు పట్టాను. ఇక నా సోదరుడు ముక్కలైన శరీరాన్నైతే అస్సలు గుర్తే పట్టలేకపోయాను...ఇలా సాగే ఈ డైలాగు లో మొత్తం కెమెరా ఫోకస్ నాకు క్లోజప్ లో ఉంటుంది. కేవలం నా ఎక్పప్రెషన్స్ పైనే ఆ సన్నివేశం ఆధారపడి ఉంటుంది. వికృతమైన ఆ నిజాన్ని భరిస్తూ నేను చెప్పే ఆ డైలాగు వాస్తవంగా రావటం కోసం నా జీవితంలోని విషాదాన్నంతా గుర్తు చేసుకున్నాను. దాంతో దాన్నించి బయిటపడటానికి ఓ పూట సమయం తీసుకుంది అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X