మిరపకాయ్ పోరికి తమిళ ప్రేక్షకుల నుండి భారీ స్పందన..!
రవితేజతో నటించిన 'మిరపకాయ్" చిత్రం తర్వాత తెలుగు తెరకు దూరమై తమిళ తెరకు దగ్గరైన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ. 'తమిళంలో నేను నటించిన తొలి చిత్రం 'మయక్కమ్ ఎన్న". ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన ప్రతిచోట ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో నా పాత్రకు అంతటా మంచి స్పందన లభిస్తోంది" అంటోంది రిచా గంగోపాధ్యాయ. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం 'మయక్కమ్ ఎన్న". ధనుష్ హీరోగా నటించాడు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ద్వారా రిచా గంగోపాధ్యాయ తమిళ తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రిచా పోషించిన పాత్రకు తమిళ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో రిచా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ' ఈ చిత్రంలో యామినిగా నటించాను. ఈ పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో ఇకపై నటనకు అవకాశమున్న పాత్రల్లో నటించాలనుకుంటున్నాను అంటున్నారు రిచా.
కాగా ప్రస్తుతం దబాంగ్ రీమేక్ లో శింబుతో నటించిన 'ఓస్తీ" చిత్రంలోనూ నా పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తారు. ఇందులో నెడువల్లి అనే మధ్యతరగతి యువతిగా నటిస్తున్నాను. ఈ పాత్ర కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టి నటిగా నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందు కంటే ఈ చిత్రం నన్ను ఓ విభిన్నమైన నటిగా నిలబెడుతుంది కాబట్టి" అంటోంది రిచా గంగోపాధ్యాయ.
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో మరోసారి టాలీవుడ్ లో రిచా గంగోపాధ్యాయ తన అదృష్టాన్ని పరీక్షంచుకోనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











