రిచా పెద్ద పెద్ద ఆఫర్స్ వెనుక అసలు రహస్యం..!?
దేన్నయినా తేలిగ్గా అర్థ చేసుకోగలను..అదే నా బలం కూడా తొలి సినిమా 'లీడర్' నుంచి తమిళ సినిమాలు 'ఓస్తి', మయక్కమ్ ఎన్న' సినిమాల వరకూ..ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విషయం కొత్తగా నేర్చుకుంటున్నా..'అని అంటోన్న 'లీడర్' భామ రిచా గంగోపాధ్యాయ్..కెరీర్ లో హిట్టూ ప్లాపూ సహజమేననీ..నటిగా తానిప్పుడు వున్న పొజిసన్ కి చాలా ఆనందంగా వుందనీ చెప్పుకొచ్చింది.
'ఒస్తి', 'మయక్కమ్' ఎన్న సినిమాలు కెరీర్ లో తనను టాప్ ప్లేస్ లో నిలబెడ్తాయనే ధీమాతో వుంది రిచా గంగోపాధ్యాయ. టాలీవుడ్ నుంచి అవకాశాలొస్తున్నాయనీ, నాలుగైదు ప్రాజెక్టులు డిస్కషన్స్ లో వున్నాయని రిచా గొంగోపాద్యాయ చెబుతోంది.
ఓ బాలీవుడ్ సినిమాకీ సైన్ చేసిన రిచా, నటనకు భాష అడ్డంకి కాదనీ, భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నటన తేలికవుతుందని అంటోంది. ఒకేసారి ఇన్ని అవకాశాలు రావడానిక ఆమె నటనా ప్రతిభ కొంత కారణమైతే మరో కారణం కూడా ఉంది. అదే రిచా 'కలివిడితనం'. తెలుగు, తమిళ పరిశ్రమల్లో జరిగే పెద్ద పార్టీలకు తప్పనిసరిగా వెళుతుందట. అక్కడ అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి, ఆకట్టుకుంటోందని సమాచారం. సినిమా పరిశ్రమకి కావాల్సింది ఆ ఫ్రెండ్లీనెస్సే కాబట్టి..రిచా వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారట. ఫలితంగా ఉప్పడు డేట్స్ ఖాలీ లేనంతగా బిజీ అయ్యింది రిచా. తెలుగులో వెంకటేష్ సరసన ఒక సినిమా, ప్రభాస్ పక్కన ఓ సినిమా, గోపిచంద్ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. ఇవి కాకుండా తమిళంలో కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











