నిజ జీవితంలో రిచా గంగోపాధ్యాయ ప్రేమ వివాదం

By Srikanya

చెన్నై : శేఖర్ కమ్ముల లీడర్ చిత్రంలో రానా సరసన చేసిన రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు ప్రేమ చిక్కుల్లో చిక్కుకుంది. ఇన్నాళ్ళూ ప్రేమ వ్యవహారాలు నడిపిన సుందర్ తో ఆమె గొడవ పడుతోంది. ఆ గొడవ ఇప్పుడు మీడియాకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే ఓ తమిళ సినిమా చిత్రీకరణ తరుణంలో రిచా, నటుడు సుందర్‌ ప్రేమించుకున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రేమ కానుకగా రిచా రూ.7 లక్షల కెమెరాను సుందర్‌కు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రిచా కుటుంబీకులు సుందర్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, రిచా చెన్నై వచ్చినప్పుడల్లా ఆమెను విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకుని హోటల్‌లో వదిలిపెట్టే వాడని సమాచారం.

సుందర్‌ పెళ్లికి తొందరపెట్టడంతో గత కొన్ని నెలలుగా కలవడానికి రిచా నిరాకరించిందట. దీంతో రిచా ఇచ్చిన కెమెరాను సుందర్‌ పగలగొట్టాడని, పెళ్లికి నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సుందర్‌ బెదిరించినట్లు సమాచారం. దీనిపై నటి రిచా మేనేజరు మాట్లాడుతూ.. రిచా ఎదుగుదలను అడ్డుకోవడానికి పన్నుతున్న కుట్ర ఇది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నందున పెళ్లి గురించి ఆలోచించట్లేదు. గత కొన్ని నెలల నుంచే వారి మధ్య మాటల్లేవు. అలాంటప్పుడు ఈ సంఘటనలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఈ వివాదంపై రిచా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.

ఇక అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' ఓ అమ్మాయిగా ముందు రిచా గంగోపాధ్యాయను తీసుకున్నారు. మళ్లీ ఏమైందో ఏమో ఆమెను తప్పించి తాప్సీని ఓకే చేశారు. అంతకు ముందు కూడా రిచా గంగోపాధ్యాయ వెంకటేష్ 'షాడో' సినిమాలో హీరోయిన్ గా తొలుత రిచాను ఖరారు చేశారు. కానీ అనుకోకుండా ఆమె స్థానంలోకి తాప్సీ వచ్చిచేరింది. ఆ తర్వాత కార్తీ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న 'బిర్యానీ' సినిమాలో కూడా రిచానే హీరోయిన్ అన్నారు. తర్వాత ఆమె స్థానంలో నీతూచంద్ర చేరిపోయింది. ఇవన్నీ ప్రతిష్టాత్మక చిత్రాలే కావడం గమనార్హం. వాటినుంచి రిచానే తప్పుకున్నారా? లేక తప్పించారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈ విషయమై రిచా గంగోపాధ్యాయ ను మీడియా కలిసింది. రిచా స్పందిస్తూ ...''అవన్నీ నా అంతట నేను వదులుకున్న సినిమాలే. సినిమా అనేది ఒప్పుకోవడానికి ఎన్ని కారణాలుంటాయో... తప్పుకోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలుంటాయి. వాటి గురించి చర్చలు లేవదీయడం వేస్ట్. ప్రస్తుతం తెలుగులో మిర్చి, సారొచ్చారు సినిమాలు చేస్తున్నా. మరో అగ్ర హీరో సినిమాకు కూడా సైన్ చేశాను. ఇవిగాక తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నా. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగానే ఉన్నా. కాబట్టి వదిలేసిన సినిమాల ప్రస్థావన ఇప్పుడు నాకు అనవసరం'' అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X